Site icon vidhaatha

Horoscope | మే 10, శ‌నివారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థిక లాభాలు..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు సంతోషంగా గడుస్తుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజేతగా నిలుస్తారు. కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. స్నేహితులతో, కుటుంబంతో విహార యాత్రలకు వెళ్లారు. ఉద్యోగంలో ప్రతిభతో ముందుకు దూసుకెళ్లారు. ఆశించిన ఆర్థిక లాభం ఉంటుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. విద్యార్థులకు కష్ట కాలం. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో విజయసిద్ధి ఉంది. లక్షసాధ్యన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంలో స్థిరమైన లాభాలు ఉంటాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆరోగ్యం సహకరిస్తుంది.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభతో, సమర్థతతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఓ శుభవార్త ఆనందం కలిగిస్తుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మనసుకు ఆనందం కలిగిస్తుంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన ప్రదేశాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

తుల

తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఏ పని కలిసి రాకపోవడంతో విపరీతమైన చికాకు కలుగుతుంది. చేప్పట్టిన పనుల్లో ఉత్సాహం లోపిస్తుంది. ఎవరితోనూ వాదనలు పెట్టుకోకుండా సమన్వయ ధోరణి ప్రదర్శించడం అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఆర్థికపరంగా, వృత్తిపరంగా గొప్ప లాభాలు అందుకుంటారు. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ధనం, వస్త్రలాభాలున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలలో ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగంలో పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. డబ్బు విపరీతంగా ఖర్చువుతుంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూల వాతావరణం ఉంది. విదేశీ ప్రయాణానికి శుభప్రదంగా ఉంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. దైవ దర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది. వృత్తి పరంగా బాగా రాణిస్తారు. కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు. ఇతరులతో వాదనకు దిగకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. లక్ష్యంపై నుంచి దృష్టి మారాలి పోకుండా జాగ్రత్తగా పడండి. ఆర్థిక నష్టం జరగవచ్చు. ఉద్యోగంలో ఓర్పు, సహనం అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

Exit mobile version