మేషం
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో సమర్థవంతంగా పనిచేసి నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్ధిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం ధృడపరచుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభం
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీరికలేని పనులతో విశ్రాంతి లేకుండా ఉంటారు. వ్యాపార అవసరాల కోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ బుద్ధి బలంతో పరిస్థితి చక్కదిద్దుతారు.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పనిప్రదేశంలో మీదైన ముద్ర వేసేందుకు అధికంగా శ్రమిస్తారు. మీ పనితీరుకు సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత పరిచయాల ద్వారా వృత్తి పరంగా లాభం పొందుతారు. సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. మీ నిజాయితీని ప్రజలు గౌరవిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లక్ష్య సాధన కష్టంగా మారుతుంది. తోటివారి సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిస్వార్థ గుణంతో పరోపకార పనులు చేపడతారు. వ్యాపారస్తులు ఆర్ధికంగా మంచి లాభాలు అందుకుంటారు. స్నేహితులతో విందు వినోదాలతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం తగదు.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రయోజనాల కోసం పని చేస్తారు. ఆదాయం పెరుగుదల పట్ల దృష్టి పెడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి అద్భుతాలు చేస్తాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అనువైన సమయం.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. చికిత్స కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. సహచరులతో అనవసర కలహాలు ఉండవచ్చు. ఆర్ధిక విషయాల్లో తెలివిగా వ్యవహరించకపోతే నష్టపోతారు.
మకరం
మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాగలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. లేకుంటే ఆర్ధిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. సేవా రంగంలో పని చేసే వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు వస్తాయి.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. ఈ మంచి సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోదించండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు, స్పెకులేషన్లకు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు మంచి రోజు. అధిక లాభాలను అందుకుంటారు.