Dreams | కలలు రావడం సహజం. ఉదయం నుంచి రాత్రి వరకు చేసిన పనులు లేదా మాట్లాడుకున్న మాటలు కలలోకి వస్తుంటాయి. అలానే చిన్ననాటి దోస్తులు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కలలోకి వస్తుంటారు. నిజంగా కష్టకాలంలో తోడు నిలిచే స్నేహితుడు దొరకడం అదృష్టమే. అలా బెస్ట్ ఫ్రెండ్స్ కలలోకి వస్తే శుభసూచకమని స్వప్న శాస్త్రం చెబుతోంది.
కలలోకి బెస్ట్ ఫ్రెండ్ వస్తే..?
కలలో బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తే శుభ సూచకమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఈ కల వచ్చిన తర్వాత జీవితమే మారిపోతుందట. మొత్తం విజయాలు కొనసాగుతాయని నమ్మకం. మంచి వారితో పరిచయాలు కూడా పెరిగే అవకాశం ఉంటుందట. కఠిన పరిస్థితుల్లో స్నేహితుడు తోడున్నాడని అనేందుకు సంకేతంగా కూడా భావించవచ్చు.
బాల్య మిత్రుడు కలలోకి వస్తే..?
బాల్య మిత్రులంటేనే ఎవరికైనా ఇష్టమే. ఎందుకంటే బాల్య జీవితానికి సంబంధించిన గుర్తులు ఎంతో మధుర స్మృతిని ఇస్తాయి. కాబట్టి బాల్య మిత్రులు ఎప్పటికీ ప్రియమే. అలాంటి స్నేహితుడు కలలోకి వస్తే జీవితంలో మంచి జరుగుతుందని సంకేతం. రాబోయే కాలమంతా స్వర్ణయుగమేనని స్వప్న శాస్త్రం చెబుతోంది.
స్నేహితుడు మరణించినట్లు కల వస్తే..?
స్నేహితుడు మరణించినట్లు కల వస్తే మీరు జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోబోతున్నారని తెలుపుతుంది. మీకు అనారోగ్యం కలుగవచ్చు. ఇలాంటి కల వచ్చినప్పుడు మానసిక శారీరక ఆరోగ్యాల మీద శ్రద్ధ పెట్టాలి.
మిత్రుడితో గొడవ జరిగినట్టు కల వస్తే..?
మిత్రుడితో గొడవ పడినట్టు కలవస్తే మీ సోషల్ లైఫ్ ఏదో ప్రమాదంలో పడబోతోందని చెప్పేందుకు సూచనగా భావించాలి. అలాంటి కల వస్తే వీలైనంత తక్కువ మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు పనిలో నిమగ్నమై ఉండడం మంచిది. చర్చలు, వాగ్వాదాలకు దూరంగా ఉండడం అవసరం.