Vastu Tips | హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి( Vastu Tips ) అత్యంత ప్రాధాన్యత ఉంది. చాలా మంది వాస్తు శాస్త్ర ప్రకారం తమ పనులను కొనసాగిస్తారు. అయితే నిత్యం ఆర్థిక సమస్యలతో( Finance Problems ) బాధపడేవారు కొన్ని వాస్తు నియమాలు తప్పక పాటించాలని చెబుతున్నారు. అప్పుడే కాస్తైనా ఆర్థిక బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని వాస్తు నిపుణుల అభిప్రాయం. సాధారణంగా నిద్ర( Sleeping ) పోయే సమయంలో మన దగ్గర నీళ్లు, సెల్ ఫోన్ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ సారి మీరు నిద్రపోయేటప్పుడు రూపాయి నాణెం( Rupee Coin ) కూడా పెట్టుకోండి. దీంతో ఆర్థిక కష్టాలన్నీ మాయమై, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఒక రూపాయి నాణెం తీసుకుని ప్రతి రోజు రాత్రి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకుని పడుకోండి. దీని వలన నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తుల ప్రభావం దూరమై.. పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.
దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా దూరమై.. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఉన్న చిక్కులు కూడా దూరమవుతాయి.
ఈ రెమిడీని ప్రతీ నెలా ఒక్కసారి చేయవచ్చు. రాత్రి పూట నిద్రపోయేటప్పుడు దిండు కింద రూపాయి నాణెం పెట్టుకుని నిద్రించాలి. తరువాతి రోజు ఆ నాణెంను పారే నది, చెరువు వంటి వాటిల్లో వదిలేయవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.