Tulasi Plant | హిందువుల నివాసాల్లో తులసి మొక్క( Tulasi Plant ) లేని ఇల్లు ఉండకపోవచ్చు. ఈ మొక్కను ఆధ్యాత్మికం( Spiritual )గానే కాకుండా.. మూలికా వైద్యం( Ayurvedam )లోనూ ఉపయోగిస్తుంటారు. ప్రధానంగా లక్ష్మీ కటాక్షం కలిగేందుకు తులసిని నిత్యం పూజిస్తుంటారు. ఇక తులసిలోని పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రెండు రకాల ప్రాముఖ్యతలు ఉన్న తులసి మొక్క విషయంలో పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తే ఆ ఇంట ఐశ్వర్యం నశించిపోయి, ఆర్థిక సమస్యలు( Finance Problems ) వెంటాడుతాయట. మరి ముఖ్యంగా ఆ మొక్కకు పోసే నీళ్ల విషయంలో జర జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి తులసి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
తులసి మొక్క విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
1. కొద్దిమంది తమ ఇంట్లో తులసిని నాటుకోవడానికి మొక్క ఇమ్మని ఇతరులను అడుగుతుంటారు. దీంతో చాలా మంది తాము పూజిస్తున్న మొక్కను నాటుకోవడానికి ఇస్తుంటారు. ఇలా పూజ చేసిన తులసి మొక్కను ఇవ్వడం తప్పంటున్నారు.
2. చాలా మంది తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటారు. అయితే అలా పోసే నీటిని ఎలా పడితే అలా పోయకూడదని అంటున్నారు. అంటే ఒకరోజు ఎక్కువ, ఒకరోజు తక్కువ పోయకూడదని చెబుతున్నారు. నీళ్లు ఎప్పుడూ సమానంగా పోయాలని.. అలాగే మొక్క వేర్లు తడిచేలా పోయాలని అంటున్నారు.
3. తులసి మొక్క మీద దుస్తులు ఆరేసిన నీళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలా పడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని అంటున్నారు.
4. చాలా మంది తులసి దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోస్తుంటారు. కానీ అలా కూడా చేయొద్దంటున్నారు. తులసి ఆకులను కేవలం సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో మాత్రమే కోయాలని అంటున్నారు.
5. అలాగే తులసి ఆకులను కేవలం మధ్యాహ్నం మాత్రమే కోయాలని, సాయంత్రం, రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదని అంటున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కోయాల్సి వస్తే విష్ణుమూర్తిని స్మరించుకుని కోయవచ్చని సలహా ఇస్తున్నారు.
6. పలు కారణాల వల్ల తులసి మొక్క ఎండిపోతే.. చాలా మంది ఎండిపోయిందని అంటుంటారు. కానీ అలా అనకూడదట. తులసి మొక్క ఎండిపోయిందని అనకుండా నిద్రపోయింది అనాలని చెబుతున్నారు. అలాగే అలా నిద్రపోయిన మొక్కను ఎక్కడపడితే అక్కడ కాకుండా పారేనీటిలో వదలాలని సూచిస్తున్నారు.