Nails Cutting | సాధారణంగా మహిళలు గోళ్లను( Nails ) ఆకర్షణీయంగా పెంచుకుంటుంటారు. పురుషుల్లో కూడా కొందరు గోళ్లను పెంచుకుంటుంటారు. ఇక చిరాగ్గా ఫీల్ అయ్యే వారు ఎప్పటికప్పుడు గోళ్లను కట్( Nails Cutting ) చేసుకుంటుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోళ్లను ఎప్పుడు పడితే అప్పుడు కట్ చేసుకోవడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. గోళ్లను కట్ చేసుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో రోజులు ఉన్నాయని చెబుతున్నారు. మరి ఇంతకీ ఏయే రోజుల్లో గోళ్లు కట్ చేసుకోవాలి..? ఏయే రోజుల్లో కట్ చేసుకోవద్దో తెలుసుకుందాం.
మన శరీరంలో గోళ్లు మృతకణాలకు ప్రతీక. కణ విభజన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృతకణాలు కొన్ని జుట్టుగా, మరికొన్ని నెయిల్స్గా పెరుగుతాయి. అందుకే, వీటిని తొలగించే క్రమంలో ప్రత్యేకమైన తిథులు, వారాలను పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా స్నానానికి ముందే నెయిల్స్ తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో కాకుండా ఇంటి బయట గోళ్లు కట్ చేసుకోవాలి.
గోళ్లను ఈ మూడు రోజుల్లో అసలు కట్ చేయొద్దు..!
చాలా మంది ఎప్పుడంటే ఎప్పుడు.. ఏ రోజంటే ఆ రోజు గోళ్లను కట్ చేస్తుంటుంటారు. అలా చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళ, గురు, శనివారాల్లో గోళ్లను కట్ చేసుకోవద్దట. ఎందుకంటే ఆయా రోజుల్లో గోళ్లు తీసుకోవడం వల్ల కుజుడు, గురు, శని గ్రహాలు అశుభ ఫలితాలను ఇవ్వడం మొదలుపెడతాయట. ఇలా చేసేవారు భవిష్యత్‌లో పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సూర్యాస్తమయం తర్వాత నెయిల్స్ కత్తిరించడం మంచిది కాదట.
ఈ మూడు రోజులు మాత్రమే అనుకూలం..!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గోళ్లు కత్తిరించుకోవడానికి సోమ, బుధ, ఆదివారాలు మంచివట. అలాగే, ఎప్పుడూ పగటిపూట మాత్రమే నెయిల్స్ కత్తిరించుకోవాలి. ఈ మూడు రోజుల్లో నెయిల్స్ కట్ చేసుకోవడం ఉత్తమ ఫలితాలను పొందే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.