Site icon vidhaatha

అప్పులు తీరాలంటే.. ఆప‌ద మొక్కుల వాడిని శ‌నివారం ఇలా పూజించండి..!

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో అప్పులు ఉంటాయి. వాటిని తీర్చేస్తుంటాం. కానీ కొన్ని సంద‌ర్భాల్లో అప్పులు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో అప్పులు తీరాలంటే ఆప‌ద మొక్కుల వాడు వేంక‌టేశ్వ‌ర స్వామిని పూజిస్తే స్వామి వారి అనుగ్ర‌హంతో కొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ‌రుస‌గా ఏడు శ‌నివారాలు ఏడు కొండ‌ల వాడిని భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధిస్తే అప్పులు త‌ప్ప‌కుండా తీరుతాయ‌ని చెబుతున్నారు. ఈ వ్ర‌తాన్ని భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ క‌లిసి చేయొచ్చు. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచి పెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే! పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా ఏడు వారాలపాటు చేయాల్సి ఉంటుంది. మ‌రి వ్ర‌త పూజా విధానం తెలుసుకుందాం..

11 రూపాయాల ద‌క్షిణ‌తో వ్ర‌తం ప్రారంభించాలి..

అప్పుల‌తో బాధ‌ప‌డేవారు శ‌నివారం తెల్ల‌వారుజామునే నిద్ర మేల్కోనాలి. అభ్యంగ‌న స్నాన‌మాచ‌రించి, పూజా గ‌దిలోకి వెళ్లాలి. శ్రీనివాసుడి పటం లేదా విగ్ర‌హాన్ని అలంక‌రించాలి. ఇక ఏడు శ‌నివారాలు వ్ర‌తం చేస్తున్న‌ట్లు మ‌న‌సులో చెప్పుకోవాలి. వ్ర‌తం మొద‌ట‌లు పెట్టిన తొలి శ‌నివారం ఒక ప‌సుపు వ‌స్త్రంలో 11 రూపాయాలు ద‌క్షిణ ముడుపు క‌ట్టి వేంక‌టేశ్వ‌రుడి విగ్ర‌హం ముందు ఉంచాలి. అప్పులు తీరిస్తే తిరుమ‌ల‌కు వ‌స్తాన‌ని మొక్కుకోవాలి.

ఆవు నేతితో దీపాలు వెలిగించాలి..

వేంక‌టేశ్వ‌రుడి పూజలో పిండి దీపానికి విశిష్టమైన స్థానం ఉంది. పిండి ప్రమిదలో ఏడు వత్తులు వేసి, ఆవు నేతితో వేంకటేశ్వరస్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవింద నామాలు చదువుకోవాలి.

నూనె అస‌లు వాడొద్దు..

వ‌త్రం చేసే వారు శ‌నివారం రోజు నూనెతో త‌యారు చేసిన వంట‌కాల‌ను ఆర‌గించొద్దు. నెయ్యితో త‌యారు చేసిన వంట‌ల‌నే తినాలి. మ‌ధ్యాహ్నం మాత్ర‌మే భోజ‌నం చేయాలి. రాత్రి పండ్లు తీసుకోవాలి. బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటించాలి. మ‌ద్యానికి దూరంగా ఉండాలి.

ఏడు శ‌నివారాల తర్వాత తిరుమ‌ల‌కు..

ఇలా నియమనిష్టలతో ఏడు శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ ఏడుకొండలవాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కి పోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది. ఇక అప్పులు బాధ‌లు తొల‌గిపోతాయ‌ని పండితులు చెబుతున్నారు.

Exit mobile version