Sun Transit in Scorpio | న‌వంబ‌ర్ 16న వృశ్చిక రాశిలోకి సూర్యుడు.. ఈ నాలుగు రాశుల‌కు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Sun Transit in Scorpio | ఒక రాశి నుంచి మ‌రో రాశిలోకి గ్ర‌హాలు( Planets ) ప్ర‌వేశిస్తుంటాయి. కొన్నిసార్లు గ్ర‌హాల క‌ల‌యిక కూడా జ‌రుగుతుంది. అయితే న‌వంబ‌ర్ 16వ తేదీన దాదాపు ఏడాది త‌ర్వాత వృశ్చిక రాశి( Scorpio )లోకి సూర్యుడు( Sun ) సంచారం చేయ‌బోతున్నాడు. ఈ సంచారం 12 రాశుల‌పై ప్ర‌భావం చూప‌నుంది. కానీ మ‌రి ముఖ్యంగా ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది.

Sun Transit in Scorpio | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు( Planets ) నెల రోజులకు ఒకసారి, మరికొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి గ్రహ సంచారం చేస్తుంటాయి. అయితే శక్తివంతంమైన సూర్యుడు( Sun ) మాత్రం న‌వంబ‌ర్ 16వ తేదీన‌ వృశ్చిక రాశి( Scorpio )లోకి సంచారం చేయ‌నున్నాడు. దాదాపు ఏడాది కాలం త‌ర్వాత వృశ్చిక రాశిలో సూర్యుడు సంచారం చేస్తుండ‌డంతో.. ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి ఊహించని లాభాలు చేకూరనున్నాయి. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. మ‌రి ఇంతకీ ఆ నాలుగు రాశులేవో తెలుసుకుందాం..

మిథున రాశి( Gemini )

వృశ్చిక రాశిలోకి సూర్యుడు సంచారం చేస్తుండడంతో మిథున రాశి వారికి అన్ని ర‌కాల క‌లిసి వ‌స్తుంది. అద్భుత స‌మ‌యం వారికిది. మిథున రాశి వారు ఏ ప‌ని చేప‌ట్టినా.. ఎలాంటి ఆటంకం లేకుండా త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. అంతేకాకుండా విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఈ రాశి వారంద‌రికి ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. వ్యాపార‌స్తులు, క‌ళారంగంలో ఉన్న‌వారు ఊహించ‌ని లాభాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి( Scorpio )

సూర్యుడు వృశ్చిక రాశిలో ప్ర‌వేశించ‌డం కార‌ణంగా ఈ రాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. ఈ రాశి వారి క‌ల‌లు త్వ‌ర‌లోనే నెర‌వేరే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారి సంపాద‌న రెట్టింపు అయ్యే అవ‌కాశం ఉంది. పెట్టుబ‌డులు పెట్టాల‌కునే వారికి కూడా ఈ స‌మ‌యం చాలా మంచిది.. క‌చ్చితంగా లాభాలు గ‌డిస్తారు.

మకర రాశి ( Capricorn )

మకర రాశి వారికి అద్భుతంగా ఉండనుంది. వీరిపై సూర్య గ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉండటం వలన వీరికి ఖర్చులు తగ్గడమే కాకుండా, ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అంతే కాకుండా ఈ రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరగడంతో వీరు చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ కూడా రావడంతో చాలా ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి( Aquarius )

కుంభ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారి పనులు పూర్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రాశి వారు వ్యాపారంలో అత్యధిక లాభాలు సొంతం చేసుకొని, చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు.