విధాత: ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం బంగారు రంగులో లేలేత కిరణాలు స్వామి మూలవిరాట్ ను తాకాయి. ఐదు నిమిషాల పాటు సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్ పై ప్రకాశించాయని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో అలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అంధవరపు రఘురాం, మండల మన్మధ రావు ఆలయ సూపరిటెండెంట్ బి .ఎస్ .చక్రవర్తి గారు పాల్గొన్నారని ఆలయ ఈవో వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు.