Zodiac Signs | గ్రహాలు ఒక రాశి( Zodiac Signs ) నుంచి మరోక రాశిలోకి సంచారం చేస్తూనే ఉంటాయి. ఇలా గ్రహాల సంచారంతో ఆయా రాశుల వారి జీవితాల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే నవ గ్రహాల్లో శక్తివంతమైన సూర్య గ్రహం( Sun ).. నిన్న కన్యా రాశి( Virgo )లోకి ప్రవేశించాడు. దాదాపు నెల రోజుల పాటు అంటే అక్టోబర్ 16వ తేదీ వరకు కన్యా రాశిలోనే సూర్యుడు సంచారం చేయనున్నారు. దీంతో ఈ నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కానుంది. మరిన్ని శుభాలు జరగనున్నాయి. మరి ఆ నాలుగు రాశులు ఏవో తెలుసుకుందాం..
కన్యా రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో.. మేష రాశి వారికి అనేక శుభ పరిణామాలు కలగనున్నాయి. వ్యాపారులకు లాభాల పంట పండనుంది. పెళ్లి కాని వారికి వివాహం నిశ్చయం కానుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించడంతో పాటు కోరుకున్న చోటికి బదిలీ కానుంది. ఆర్థికంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. రుణాలు తీరుతాయి. ఆర్థిక నిల్వలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఈ నెల 21 వ తేదీ రానున్న మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
మిథున రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంది. ఆకస్మిక ధన లాభాలు కలగనున్నాయి. ఉద్యోగులు ప్రమోషన్లు అందుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబ శ్రేయస్సు, కార్యజయం ఉంటాయి. ఈ నెల 21 వ తేదీ రానున్న మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణులకు అన్నదాన, వస్త్ర దానం చేయడం వలన పితృ దోషాలు తొలగిపోతాయి.
కన్యారాశిలో సూర్య సంచారంతో తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశివారికి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి పదోన్నతులు ఉంటాయి. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ నెల 21 వ తేదీ రానున్న మహాలయ అమావాస్య రోజు నువ్వులు దానం చేయడం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది.
కన్యారాశిలో సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి శుభ యోగాలను ఇస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పటివరకు ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. గ్రహాల అనుకూలత వల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగులు గత కొంత కాలంగా వాయిదా పడుతున్న పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులు విశేషమైన లాభాలు అందుకుంటారు .ఈ నెల 21 వ తేదీ రానున్న మహాలయ అమావాస్య రోజు పితృ దేవతల ప్రీతి కోసం అన్నదానం చేయడం, గోవుకు గ్రాసం అందించడం చేయడం వల్ల శుభ యోగాలుంటాయి.