Vastu Tips | ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిని వాస్తు నియమాలకు( Vastu Tips ) అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. అయితే ఇల్లు నిర్మాణం తర్వాత ఇంట్లో వాస్తు నియమాలు పాటించడం లేదు. దీని ఆ ఇంట కుప్పలుతెప్పలుగా అప్పులు( Debts ) పుట్టుకొస్తాయి. ఆ అప్పుల నుంచి విముక్తి పొందలేక ఆందోళనకు గురవుతుంటారు. కాబట్టి వాస్తు నిపుణుల( Vastu Experts ) ప్రకారం ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే.. అప్పుల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఆ నాలుగు చిట్కాలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
తులసి మొక్క
ప్రతి ఇంట్లో తులసి మొక్క కనిపిస్తుంది. దానికి ప్రతి రోజు పూజలు చేస్తుంటారు. కానీ ఆ తులసి మొక్కను సరైన దిశలో ఉంచరు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసి మొక్కను ఇంటికి ఈశాన్యం దిశలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటడం వలన ఇంట్లో అప్పుల బెడద తగ్గి, ఆరోగ్యంగా ఉంటారట. కొన్నాళ్లకు సంపద కూడా సమకూరుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
కలశం..
కలశం.. ఇది ప్రతి పూజ గదిలో దర్శనమిస్తుంది. స్వచ్ఛతకు గుర్తు కూడా. అందుకే దీన్ని ఇంటికి ఈశాన్య లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. కలశం వల్ల జీవితంలోని ప్రతికూల శక్తులు తొలగిపోయి.. సానుకూల శక్తి ప్రవేశిస్తుందట. ఇది ఇంటి లోపల ఆనందం, సంపదకు కారణం అవుతుందంట.
శంఖం
సముద్రం నుంచి తీసిన పవిత్ర వస్తువు అయిన శంఖాన్ని లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే దీనిని కూడా పూజా సమయంలో ఊదడం సహజం. అయితే దీనిని లక్ష్మీదేవి విగ్రహానికి కుడివైపున పెట్టాలంట. అలాగే స్వస్తిక్, శుభం అనే చిహ్నాలు కూడా ఇంటికి లక్కును తీసుకొస్తాయి. కాబట్టి, వీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద గీయడం చాలా మంచిది.
ఇత్తడి, రాగి లోహాలు..
అలాగే ఇత్తడి, రాగి వంటి లోహాలు చాలా శక్తివంతమైనవి అందువలన వీటిని ఇంటి పూజ గదిలో ఈశాన్యం లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఇత్తడి గంటను ఉపయోగించి, ఉత్తర దిశలో పెట్టాలంట. ఈ చిట్కాలు పాటిస్తే దాదాపు అప్పుల బెడద నుంచి ఉపశమనం పొందొచ్చు అని వాస్తు పండితులు చెబుతున్నారు.
