Weekly Horoscope | ఈ వారం రాశిఫ‌లాలు.. షేర్‌మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెట్టిన ఈ రాశి వారికి గొప్ప లాభాలు..!

Weekly Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని విశ్వసిస్తుంటారు. ఈ క్ర‌మంలో ప్ర‌తి రోజు, ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా వ్య‌క్తులు త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Vidhaatha Weekly Horoscope

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో అధికార యోగం స్పష్టంగా ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారులకు ఈ వారం కొంత మధ్యస్తంగా ఉంటుంది. ఆటంకాలు ఎదురైనప్పటికి అధిగమించే ప్రయత్నం చేస్తారు. మొహమాటంతో లాభాలు తగ్గే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణం, ఆస్థి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే సూచన ఉంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్న సంఘర్షణకు అవకాశం ఉంది. ఓర్పు, అవగాహన ముఖ్యం.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో చేసే ప్రయత్నాలు తప్పకుంగా ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగినా సహచరులను కలుపుకుని పోవడం వల్ల అనుకూలత ఉంటుంది. ఆశించిన విజయాల కోసం ఓపిక, సహనం అవసరం. వ్యాపారులు స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పెట్టుబడుల విషయంలో నిదానంగా వ్యహరించండి. మార్కెట్ గమనిస్తూ పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచన ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాలలో అభివృద్ధి ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారంలో పెట్టుబడులపై లాభాలు పెరుగుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అధిక లాభాలు అందిస్తాయి. లక్ష్మీకటాక్ష సిద్ధితో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో శాంతం, సహనంతో ఉండడం అవసరం. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలంగా, విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు, నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి, వ్యాపారంలో అభివృద్ధి వేగంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడంతో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నూతన వస్తువాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. ఆచి తూచి నడుచుకుంటే మేలు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాలు లేక నిరాశతో ఉంటారు. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాల కోసం కృషిని కొనసాగించండి. వ్యాపారులు సమయానుకూల నిర్ణయాలతో లాభాలు పొందవచ్చు. పోటీదారులతో జాగ్రత్తగా ఉండండి. సమిష్టి నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. దైవ బలంతో కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని సవాళ్లు ఎదురైనా సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఓ శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. బుద్ధి బలంతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. విలాసవంతమైన వస్తువుల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. స్థిరాస్తి రంగం, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు గొప్ప లాభాలను పొందుతారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు స్వయంకృషితో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో అదృష్టయోగం ఉంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతానంకు సంబంధించిన శుభవార్తలు వింటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగిపోతాయి. అన్ని రంగాలవారు వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లండి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేముందు జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో కృషి, పట్టుదల తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగంలో బాధ్యతగా పనిచేస్తే ఉన్నతాధికారులు ప్రసన్నం అవుతారు. చిన్న చిన్న పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించండి. అధికారులతో లౌక్యంగా, వినయంగా నడుచుకోవాలి. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వ్యాపారంలో స్థిరత్వం ఉన్నప్పటికీ కొత్త ప్రయోగాలకు అనువైన సమయం కాదు. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకం ఉండవచ్చు. కుటుంబంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. సంయమనం పాటించాలి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం ప్రారంభంలో వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. కీలకమైన వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే శక్తి లోపిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండవచ్చు. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు నిజాయితీ, నిబద్దతతో వ్యవహరిస్తే ఆశించిన ప్రయోజనాలు పొందవచ్చు. స్వీయ నిర్ణయాలు మేలు చేస్తాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు, పదోన్నతులు పొందుతారు. అదనపు రాబడితో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారంలో ధర్మబద్ధత, ఓర్పుతో వ్యవహరిస్తే అడ్డంకులు తొలగుతాయి. మీ అనుభవం, జ్ఞానం మంచి లాభాలు తెచ్చి పెడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. కీలక వ్యవహారాల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధురస్మృతులు నెమరువేసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ వారం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ వేడుకల్లో బంధు మిత్రులతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు, స్థానచలనం ఉండవచ్చు. ఆదాయం పెరగడం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారంలో శుభలాభాలు సంతోషం కలిగిస్తాయి. కీలక పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన భూ, గృహ వాహన యోగాలున్నాయి.