మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాలవారు తమ కెరీర్‌లో మంచి పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు అనేక మార్గాల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. లాభాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచాలి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్త వహించండి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు అలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిదానించడం మంచిది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ఆర్థిక సమస్యలు నివారించడానికి సరైన ఆర్థిక ప్రణాళిక అవసరం. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. పదవీయోగం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు కలిసి వచ్చే కాలం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం. వ్యాపార విస్తరణకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. షేర్ మార్కెట్ పెట్టుబడులపై లాభాలు మెరుగ్గా ఉంటాయి. అనుకోని నష్టాలు సంభవించే అవకాశముంది కాబట్టి ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వాదనలకు దూరంగా ఉంటే కుటుంబ సంబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో అపోహలు ఏర్పడతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కెరీర్ పరంగా కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారు మంచి అవకాశాలు అందుకుంటారు. వ్యాపారులకు శుభ సమయం నడుస్తోంది. వ్యాపారాన్ని పలు ప్రాంతాలకు విస్తరించి విశేషమైన లాభాలు గడిస్తారు. ఆర్థికంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. మంచి ప్రణాళికతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కెరీర్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి కోసం అదనపు కృషి చేయాల్సి ఉంటుంది. సహచరులతో, అధికారులతో సౌమ్యంగా నడుచుకోవాలి. వ్యాపారంలో తరచూ ఆటంకాలు ఉండవచ్చు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఆటంకాలు అధిగమించవచ్చు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి పెట్టుబడులు వాయిదా వేస్తే మంచిది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉండవచ్చు కాబట్టి అవగాహన, సహనంతో ముందుకు సాగాలి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సన్నిహితుల సహకారంతో నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగులు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. విద్యార్థులు సానుకూల ఫలితాల కోసం మరింత కృషి చేయాలి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి.
తుల (Libra)
తుల రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ ఆటుపోట్లు లేకుండా సజావుగా సాగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు ఆహ్వానం పలుకుతాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఆటంకాలు ఉండవచ్చు. పాత వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించడానికి సరైన సమయం. సమయానుకూలంగా నడుచుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబ సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబంలో కలహాలు రాకుండా మాటను అదుపులో ఉంచుకోండి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు అవగాహనతో తొలగిపోతాయి. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా అభివృద్ధి పథంలో పయనిస్తారు. ఉద్యోగంలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. సహోద్యోగుల సహకారం, అధికారుల మద్దతు ఉంటుంది. పదోన్నతులకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారులకు కూడా ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులతో వ్యాపార అవకాశాలు మెరుగు పడతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు సానుకూలతతో ముందుకెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఇల్లు, భూమి కొనుగోలు చేయడానికి ఇది అనుకూల సమయం.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో పురోగతి మందగిస్తుంది. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాల్లో మెరుగైన ప్రయోజనాలు కోసం తీవ్రంగా శ్రమించాలి. ఉద్యోగంలో స్థిరత్వం కోల్పోకుండా జాగ్రత్త వహించండి. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. వ్యాపారులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా ఏర్పడిన ఆటంకాలు పట్టుదలతో అధిగమిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తిరీత్యా తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వృత్తి నిపుణులు కొత్త ప్రాజెక్ట్‌లు అందుకుంటారు. పని ఒత్తిడి పెరిగినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపార వృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ సంస్థల్లో పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడి చదివితేనే విజయం సాధించగలరు. వైవాహిక జీవితం ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగిపోతుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ముందుచూపుతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపారంలో సమయానుకూల నిర్ణయాలతో నష్టాలు నివారించవచ్చు. ఆర్థికంగా గడ్డు సమయం. ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోండి. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. బహిరంగ సంభాషణలతో విభేదాలు తొలగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో సహనం, అవగాహన అవసరం.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు కెరీర్ పరంగా మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉంటాయి. మీ ప్రతిభకు, సమర్ధతలకు గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించే వారు కొంత సమయం వేచి చూడటం మంచిది. వ్యాపారులు ప్రారంభించిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సహనంతో మెలగాలి. కుటుంబ సమస్యల పట్ల సంయమనం పాటించాలి. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. సన్నిహితులతో విహారయాత్రకు వెళ్తారు.
