Astrology | రాత్రింబవళ్లు కష్టపడ్డా కూడా కొందరిని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఏ పని చేపట్టిన విజయవంతం కాదు. అదృష్టం కోసం వేచి చూస్తుంటారు. ఈ అదృష్టం కూడా అంత ఈజీగా కలిసిరాదు. మీకు అదృష్టం కలిసి రావాలంటే.. చేపట్టిన పనులు విజయవంతం కావాలంటే.. ధరించే దుస్తుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 12 రాశుల వారికి కలిసొచ్చే రంగులు ఉన్నాయి. అయితే ఏ రంగు దుస్తులు.. ఏ రోజు ధరించాలనేది కూడా ముఖ్యం. మరి ఇప్పుడు ఆ రంగు దుస్తులు ఏవో తెలుసుకుందాం.
ఆదివారం
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఏ రాశి, ఏ నక్షత్రం వారైనా ఆదివారం నాడు లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించడం కారణంగా విపరీతమైన అదృష్టం కూడా కలిసి వస్తుందట. ఇకపోతే.. నలుపు, నీలం, ముదురు ఆకుపచ్చ రంగువి ధరించడం దురదృష్టాన్ని ఇస్తుందట.
సోమవారం
సోమవారం తెలుపు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరమట. అదే.. పసుపు రంగు దుస్తులు ధరిస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయంటున్నారు. అలాగే.. ముదురు ఎరుపు(డార్క్ రెడ్), నలుపు లేదా ముదురు నీలం రంగులు ధరిస్తే ఈ రోజు కలిసిరాదట.. అలాగే ఇవి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయంటున్నారు.
మంగళవారం
మంగళవారం ముదురు ఎరుపు రంగు బట్టలు ధరించడం వల్ల బాగా కలసివస్తుందట. అదే.. వెండి లాంటి తెల్లటి రంగు మాత్రం మిశ్రమ ఫలితాలను ఇస్తుందంటున్నారు. మంగళవారం ముదురు పచ్చవి, ముదురు నీలం ధరిస్తే.. ఈరోజు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు జ్యోతిష్యులు.
బుధవారం
బుధవారం నాడు ముదురు ఆకుపచ్చ వస్త్రాలు వేసుకోవడం బాగా కలసివస్తుందంటున్నారు. అదే.. ముదురు నీలం, నలుపు రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట. బుధవారం ఎరుపు అంతగా కలసిరాదంటున్నారు. అలాగే.. తెలుపు, పసుపువి ఈరోజు ధరించకపోవడమే మంచిదట.
గురువారం
ఈరోజు బాగా కలసిరావాలంటే పసుపు రంగు దుస్తులు వేసుకోవడం మంచిదట. అదే.. ముదురు నీలంవి మిశ్రమ ఫలితాలు ఇస్తాయంటున్నారు. ఇకపోతే గురువారం ముదురు ఎరుపు, లేత ఎరుపు వస్త్రాలు అంత కలసిరావట.
శుక్రవారం
వెండి లాంటి తెలుపు కలర్ ధరిస్తే ఈరోజు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు. అదే.. ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం మిశ్రమ ఫలితాలను కలిగిస్తాయట. ఇకపోతే శుక్రవారం.. పసుపు కలర్ అంతగా కలసిరాదట. అలాగే.. ముదురు ఎరుపు ఈరోజు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటున్నారు.
శనివారం
ఈరోజు బాగా కలసివచ్చే కలర్‌గా బ్లాక్‌ని చెప్పుకోవచ్చంటున్నారు. అదే.. వెండి లాంటి తెలుపు, ముదురు నీలం రంగులు మిశ్రమ ఫలితాలను అందిస్తాయట. ఇక శనివారం ఎరుపు రంగు అంతగా కలసిరాదంటున్నారు. అలాగే.. పసుపు రంగు దురదృష్టాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు.