Site icon vidhaatha

Dream | క‌ల‌లో సూర్యాస్త‌మ‌యం క‌నిపించిందా..? దాని అర్థం ఏంటో తెలుసా..?

Dream | ప్ర‌తి ఒక్క‌రికి క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. ప‌గ‌లు, రాత్రి అనే తేడా లేకుండా.. నిద్ర‌లోకి జారుకున్నాక క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌లు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి. క‌ల వ‌చ్చిన‌ప్పుడు నిద్ర‌లోనే ఉలిక్కిప‌డుతుంటారు. మేల్కొని చూసేస‌రికి అది క‌ల అని తెలిసిపోతోంది. ఇక చాలా మందికి క‌ల‌లో దేవుళ్లు వ‌స్తుంటారు. లేదంటే ఆ రోజు ఉద‌యం నుంచి రాత్రి దాకా చేసిన ప‌నులు మ‌రోసారి క‌ల రూపంలో వ‌స్తుంటాయి. అయితే ప్ర‌ధానంగా క‌ల‌లో సూర్యాస్త‌మ‌యం క‌నిపిస్తే ఏమ‌వుతుంది..? దాని అర్ధం ఏమిటి? స్వప్న శాస్త్రం ప్రకారం.. భవిష్యత్తులో ఆ కల ఏమి సూచిస్తుందో .. ఆ కలకు సంబంధించిన లక్షణలు ఏమిటో తెలుసుకుందాం..

కొత్త అధ్యాయం ప్రారంభానికి సూచిక‌..!

క‌ల‌లో సూర్యాస్త‌మ‌యం రావ‌డం అనేది భిన్నాభిప్రాయాల‌ను సూచిస్తుంది. ఇలాంటి క‌ల‌లను ప్ర‌తికూలంగా ప‌రిగ‌ణించాల‌ని స్వప్న శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే సూర్యాస్తమయం ఒక రోజు ముగింపున‌కు.. కొత్త రోజు ప్రారంభానికి సన్నాహకంగా పరిగణించబడుతుంది. కనుక ఇటువంటి కల పాత అధ్యాయం ముగిసిందని… ఇక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచిస్తుందని అంటున్నారు.

వ్య‌క్తిగ‌త జీవితంలో స‌వాళ్లు..!

స్వ‌ప్న శాస్త్రం ప్రకారం సూర్యుడు కలలో అస్తమించినట్లు క‌నిపిస్తే.. వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో చాలా సవాళ్లు ఎదురవుతాయని అర్థం. ఈ కల పోరాటానికి నాందిగా పరిగణించబడుతుంది.

భ‌విష్య‌త్‌లో కొత్త వ్యాపారానికి శుభ‌సూచ‌కం..!

కలలోకి అస్తమించే సూర్యుడు రావ‌డాన్ని మంచి సంకేతంగా కూడా భావిస్తారు. ఇటువంటి కల రావడం అంటే మీరు భవిష్యత్తులో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు శుభ‌సూచ‌కంగా చెప్పొచ్చు. అస్తమించే సూర్యుని కలలు కనడం కూడా అంతర్గత బలాన్ని సూచిస్తుంది.

శాంతి రాబోతుంద‌ని అర్థం..

ఈ కల ద్వారా జీవితంలోని వివిధ సమస్యలు తొల‌గిపోతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి. జీవితంలో అపారమైన ఆనందం, శాంతి రాబోతుంద‌ని అర్థం. జీవితాంతం ప‌ని చేయ‌కుండా.. కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచన.

Exit mobile version