Site icon vidhaatha

గ‌ణ‌నాథుడు క‌ల‌లోకి వ‌స్తే శుభ‌మా..? అశుభ‌మా..?

ప్ర‌తి ఒక్క‌రికి క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. నిద్ర‌లోకి జారుకున్న త‌ర్వాత క‌ల‌లు ప‌డుతుంటాయి. ఆ రోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పైనో లేదా భ‌విష్య‌త్ ఆలోచ‌న‌లే క‌ల‌లోకి వ‌స్తుంటాయి. ఎందుకంటే నిత్యం వాటి గురించి ఆలోచిస్తుంటాం కాబ‌ట్టి. ఇక కొన్ని సంద‌ర్భాల్లో దేవుళ్లు కూడా క‌ల‌లోకి వ‌స్తుంటారు. ఆ దేవుళ్లు మ‌న‌కు ఏదో హిత‌బోధ చేసిన‌ట్లు.. పొద్దున్నే లేచి వాటిని ఇంప్లిమెంట్ చేసేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. క‌ల‌లోకి వ‌చ్చే వాటిలో కొన్నింటిని అశుభంగా కూడా ప‌రిగ‌ణిస్తారు. మ‌రి గ‌ణ‌నాథుడు క‌ల‌లోకి వ‌స్తే శుభ‌మా..? అశుభ‌మా..? అస‌లు క‌ల‌లోకి విఘ్నేశ్వ‌రుడు వ‌స్తే ఏం జ‌రుగుతుందో తెలుసుకుందాం..

గ‌ణ‌నాథుడిని పూజిస్తున్న‌ట్లు..

స్వప్నశాస్త్రం ప్రకారం, గ‌ణ‌నాథుడిని పూజిస్తున్నట్లు మీకు క‌ల వ‌స్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. త్వరలో మీరు కొన్ని శుభవార్తలను వింటార‌ని విశ్వాసం. అంతేకాదు మీరు ఏదైనా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, వెంటనే వాటికి పరిష్కారం కనుగొంటారు. ఈ కల వచ్చిన వారికి ఆకస్మాత్తుగా ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.

తెల్లవారుజామునే కల‌లోకి వ‌స్తే..

చాలా మందికి తెల్ల‌వారుజామున క‌ల‌లు ప‌డుతుంటాయి. ఈ స‌మ‌యంలో వినాయ‌కుడు క‌ల‌లోకి వ‌స్తే శుభ ఫ‌లితాలు ఉంటాయ‌నేది న‌మ్మ‌కం. కోరిన కోరిక‌ల‌న్నీ నెర‌వేరుతాయ‌ట‌. ఏ రోజు అయితే గ‌ణ‌నాథుడు క‌ల‌లోకి వ‌స్తాడో.. అదే రోజు ఉద‌యాన్ని వినాయ‌కుడి మంత్రాల‌ను ప‌ఠించ‌డం వ‌ల్ల ఆర్థికంగా లాభాల‌ను పొందుతార‌ట‌. కేరీర్ ప‌రంగా కూడా మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని పండితులు చెబుతున్నారు.

గ‌ణ‌నాథుడితో మాట్లాడినట్టు..

గ‌ణ‌నాథుడితో మాట్లాడిన‌ట్లు క‌ల వ‌స్తే.. మీరు నేరుగా ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలోకి వెళ్తున్నారని అర్థం. ఈ కల వచ్చిన వారు జీవితంలో తెలివైన వ్యక్తి నుంచి మార్గదర్శకత్వం అవసరమని సూచిస్తుంది. అలాగే కలలో విరిగిన దంతం కనిపిస్తే త్యాగానికి ప్రతీకగా భావిస్తారు.

లంబోద‌రుడి విగ్రహం కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం, వినాయక విగ్రహాలు కలలో కనిపించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ పెండింగ్ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మీరు ఆకస్మికంగా సంపదను పెంచుకుంటారు. మీరు చేపట్టే ప్రాజెక్టులో మంచి విజయం సాధిస్తారని పండితులు సూచిస్తున్నారు.

Exit mobile version