Vastu Tips | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఇంటిని వాస్తుకు అనుగుణంగా నిర్మించుకుంటున్నారు. ఇక ఇంట్లో అమర్చుకునే వస్తువుల విషయంలోనూ వాస్తు ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా చెత్త డబ్బా( Dust Bin ), చెప్పుల స్టాండ్( Shoe Rack ) వంటి విషయాల్లో కూడా వాస్తు నియమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే చెత్త డబ్బే కదా.. ఎక్కడో ఒక చోటు పెడుదాం అనుకుంటే.. తప్పు చేస్తున్నట్టే. ఇంట్లో సరైన దిశలో డస్ట్ బిన్( Dust Bin )ను ఉంచకపోతే.. ఆ ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి అనేక సమస్యలు చుట్టుముడుతాయట. అంతేకాకుండా ఆర్థిక కష్టాలు వెంటాడి.. ఇంటి యజమానికి మనశ్శాంతి లేకుండా పోతుందట. మరి డస్ట్ బిన్‌ను ఏ దిశలో ఉంచాలి..? ఏ దిశలో పెడితే ఏం లాభనష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం..
తూర్పు దిక్కు ( East )
వాస్తు శాస్త్రం ప్రకారం చెత్త డబ్బాను తూర్పు( East ) దిక్కులో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తూర్పు దిశలో డస్ట్ బిన్‌ను ఉంచితే.. ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందట. ఆ ఇంట కష్టాలు ఏరులై పారుతాయట. కాబట్టి మరిచిపోయి కూడా తూర్పు దిశలో చెత్త డబ్బాను ఉంచకండి.
పడమర దిక్కు ( West )
పడమర( West ) దిక్కున చెత్త బుట్టను ఉంచడం వల్ల ఆ ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ( Negative Energy ) ప్రవేశిస్తుందట. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు సుఖసంతోషాలకు దూరమై.. ఏదో ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతారట. కాబట్టి ఈ దిశ కూడా డస్ట్ బిన్‌కు కరెక్ట్ కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఉత్తర దిక్కు ( North )
ఉత్తర( North ) దిక్కులో డస్ట్ బిన్‌ను ఉంచడం కూడా మంచిది కాదట. ఎందుకంటే ఆ ఇంట్లో వారి ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందట. అలాగే వ్యాపారంలోనూ ఒడిదుడుకులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
దక్షిణం దిక్కు ( South )
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ( South ) దిశలో డస్ట్ బిన్ పెడితే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఇంట్లో వాళ్లకు మానసిక సమస్యలు తలెత్తుతాయట.
ఆగ్నేయం ( Southeast )
వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయం( Southeast )లోనూ చెత్త డబ్బాను ఉంచకూడదట. దీనివల్ల ఆ ఇంట్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
నైరుతి( Southwest )
డస్ట్ బిన్‌కు ఉత్తమమైన దిశ నైరుతి( Southwest ) అని వాస్తు శాస్త్రం చెబుతుంది. నైరుతిలో డస్ట్ బిన్ పెడితే ఆ ఇంట్లో అనుకూలత పెరుగుతుందట. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారట.
వాయవ్యం ( Northwest)
వాస్తుశాస్త్రం ప్రకారం డస్ట్ బిన్ పెట్టుకునేందుకు మరో అనువైన దిశగా వాయవ్యాన్ని( Northwest ) సూచిస్తున్నారు వాస్తు నిపుణులు. వాయవ్యంలో డస్ట్ బిన్ పెడితే ఆ ఇంట్లో వాళ్లకు చేసే పని మీద శ్రద్ద పెరుగుతుందట. ప్రతికూల ఆలోచనలు వారి మనసుల్లోకి రావట. ఆ ఇంట్లో సుఖసంతోషాలకు కొదువ ఉండదట.
ఈశాన్యం ( Northeast )
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఎప్పుడూ ఈశాన్య దిశ( Northeast)లో ఉంచకూడదు. ఎందుకంటే ఈ దిశ దేవుని సన్నిధితో ముడిపడి ఉంటుందట. అలా ఉంచడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వాస్తు నిపుణులు.