Indian Railways | భారతీయ రైల్వేలో( Indian railways ) టెక్నీషియన్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా 6,238 టెక్నీషియన్ పోస్టుల( Technician Posts ) భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 28లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించేందుకు చివరి తేది జూలై 30గా RRB ప్రకటించింది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు చివరి తేదీ: జూలై 28, 2025
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూలై 30, 2025
• దరఖాస్తు సవరణ (modification) విండో: ఆగస్టు 1 నుండి ఆగస్టు 10 వరకూ
పోస్టుల వివరాలు:
• Technician Grade 1 (Signal)
• Technician Grade III (వివిధ విభాగాల్లో)
• మొత్తం ఖాళీలు: 6,238
దరఖాస్తు చేసుకునే విధానం:
1. అధికారిక వెబ్‌సైట్: https://rrbapply.gov.in
2. హోంపేజీలో “CEN No. 02/2025 – Technician Recruitment 2025” లింక్ క్లిక్ చేయండి
3. “Apply Online” పై క్లిక్ చేసి, ఆధార వివరాలు నమోదు చేయాలి
4. రిజిస్ట్రేషన్ తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయ్యి పూర్తి ఫారమ్ నింపాలి
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి
6. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి
7. అప్లికేషన్ సమర్పించిన తర్వాత కన్‌ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసుకోవాలి
అవసరమైన డాక్యుమెంట్లు:
• తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం స్కాన్ కాపీ
• గుర్తింపు పత్రం (ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ మొదలైనవి)
• విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు
• కుల సర్టిఫికెట్ (తగినవారి కోసం)
• స్థానికత సర్టిఫికెట్ (నోటిఫికేషన్‌లో ఉంటే)
ఇతర సూచనలు:
• ఇప్పటికే RRB సెంట్రల్ నోటిఫికేషన్ కోసం అకౌంట్ క్రియేట్ చేసిన వారు తిరిగి రిజిస్టర్ అవసరం లేదు.
• ఆన్‌లైన్ ఫారమ్ మాత్రమే సమర్పించాలి. పోస్ట్ ద్వారా ఎలాంటి హార్డ్‌కాపీ పంపాల్సిన అవసరం లేదు.
అర్హత – వయో పరిమితి:
• Technician Grade I Signal: 18 నుంచి 33 సంవత్సరాల మధ్య (జూలై 1, 2025 నాటికి)
• Technician Grade III: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య
ఈ ఉద్యోగ అవకాశంపై మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఆ ప్రాంతీయ RRB వెబ్‌సైట్లను కూడా సందర్శించవచ్చు.