Site icon vidhaatha

JEE MAIN results | ఈ నెల 25న జేఈఈ మెయిన్‌-2 ఫలితాలు విడుదల

JEE MAIN results : జేఈఈ మెయిన్‌ సెషన్-2 (JEE MAIN-2) పరీక్షల ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది. జేఈఈ మెయిన్‌-2024 ఏప్రిల్‌ సెషన్‌కు హాజరైన విద్యార్థులు తమ జేఈఈ స్కోర్‌ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ https://jeemain.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలను ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో నిర్వహించారు. దేశవ్యాప్తంగా 319 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి. భారతదేశం వెలుపల కూడా 22 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన తాత్కాలిక ఆన్సర్‌ కీని ఏప్రిల్‌ 12న ప్రచురించారు. ఏప్రిల్‌ 14 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.

Exit mobile version