SSC CGL 2025 | మీరు డిగ్రీ( Degree ) పూర్తి చేశారా..? కేంద్ర ప్రభుత్వం( Union Govt )లో కొలువుల( Jobs ) కోసం ఎదురు చూస్తున్నారా..? అయితే మీ లాంటి వారి కోసమే.. ఎస్ఎస్‌సీ సీజీఎల్( SSC CGL ) 14582 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్( Job Notification ) విడుదల చేసింది. ఈ ఉద్యోగం వస్తే.. మంచి జీతభత్యాలు, పదోన్నతులు. అంతేకాదు.. వారానికి ఐదు రోజులే పని దినాలు. అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం( Software Job ) మాదిరి అన్నమాట. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్ష విధానం, అర్హతలు, ఆన్‌లైన్ దరఖాస్తు విధానం తదితర వివరాలను తెలుసుకుందాం..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్( Staff Selection Commission )
కేంద్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్ బీ, సీ, డీ తదితర పోస్టుల భర్తీతోపాటు కేంద్ర సాయుధ దళాల్లో వివిధ ఖాళీల భర్తీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission ) నిర్వహిస్తుంది. దీనిలో అత్యంత క్రేజీ కలిగిన జాబ్ నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ( CGL ) ఎగ్జామ్. ఈ పరీక్ష ద్వారా కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో, డిపార్ట్‌మెంట్స్, ఆర్గనైజేషన్స్‌తోపాటు పలు రకాల రాజ్యాంగబద్ధ సంస్థలు, బాడీస్, ట్రిబ్యునల్స్ తదితరాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 14582
ఈ శాఖల్లోనే ఉద్యోగాల భర్తీ..
సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే మంత్రిత్వశాఖ, విదేశాంగ శాఖ, ఏఎఫ్‌హెచ్‌క్యూ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, సీబీడీటీ, సీబీఐసీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, సీబీఐ, పోస్టల్ శాఖ, కమ్యూనికేషన్ శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, ఆర్థిక శాఖ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ, కాగ్, ఎన్‌ఐఏ, ఎంహెచ్‌ఏ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ, సీజీడీఏ, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ , మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ తదితర శాఖలు.
ఈ పోస్టులకు అర్హులు ఎవరు..?
2025, ఆగస్టు 1 నాటికి 18- 27 (జేఎస్‌వో పోస్టుకు 32, కొన్ని పోస్టులకు 30) ఏండ్ల మధ్య ఉన్న వారు అర్హులు. ఆయా పోస్టులకు వయస్సు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
నోట్ : రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు
జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు డిగ్రీతోపాటు ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. గ్రేడ్-2 స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టుకు డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే సరిపోతుంది.
నోట్: ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ అభ్యర్థులు 2025, ఆగస్టు 1 నాటికి డిగ్రీ అర్హత సాధించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
– రెండు దశల్లో (టైర్స్) ఉంటుంది
– టైర్-1, టైర్-2
టైర్-1 పరీక్ష విధానం
– ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
– జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు
– జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు
– క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు
– ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు- 50 మార్కులు
– పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
– ఆబ్జెక్టివ్ విధానంలో, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
– ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ మాత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుంది.
– నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోతవిధిస్తారు.
టైర్-2 పరీక్ష విధానం
– టైర్ – 2లో పేపర్-1,2 ఉంటాయి. వీటిని రెండు షిప్టులు/రోజుల్లో నిర్వహిస్తారు.
– పేపర్-1 అన్ని పోస్టులకు తప్పనిసరి.
– పేపర్-2 అనేది జేఎస్‌వో, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు తప్పనిసరిగా రాయాలి.
– పేపర్-1లో మూడు సెషన్లు ఉంటాయి.
– సెషన్-1లో మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు.
– మొత్తం 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి రెండు గంటల పదిహేను నిమిషాలు.
– సెషన్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షనల్ నుంచి 45 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
– మొత్తం 70 ప్రశ్నలు. 210 మార్కులు.
– సెషన్-3లో రెండు మాడ్యుల్స్ ఉంటాయి. మొదటి మాడ్యుల్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ పై టెస్ట్ ఉంటుంది. దీనికి 60 మార్కులు. రెండో మాడ్యుల్‌లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యుల్ ఉంటుంది.
నోట్: పేపర్-2 స్టాటిస్టిక్‌పై ఉంటుంది. దీనిలో 100 ప్రశ్నలు, 200 మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు
నోట్: నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు కోత విధిస్తారు. కొన్ని సెక్షన్లలో 0.50 మార్కులు కోతవిధిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 4
టైర్-1 పరీక్షలు: ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 మధ్య నిర్వహిస్తారు
టైర్-2 పరీక్షలు: డిసెంబర్‌లో
వెబ్‌సైట్: https://ssc.gov.in