Site icon vidhaatha

Protest | ఈ నెల 8న DSE ముట్టడి.. DSC పరీక్ష వాయిదాకు డిమాండ్‌

Protest : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదావేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (DSE)’ను ముట్టడించారు. ఈ మేరకు నిరుద్యోగ జేఏసీ నేతలు, అభ్యర్థులు పిలుపునిచ్చారు. టెట్‌ పరీక్షలు నిర్వహించిన వెంటనే డీఎస్సీ నిర్వహించడాన్ని అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

టెట్‌, డీఎస్సీ పరీక్షల సిలబస్‌ వేరు కావడం, డీఎస్సీ ప్రిపరేషన్‌కు తగిన సమయం లేకపోవడంతో అభ్యర్థులంతా డీఎస్సీ పరీక్షలను వాయిదావేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్టోబర్‌లో పరీక్షలను నిర్వహించి, వచ్చే ఏడాది జూన్‌లో పోస్టింగ్స్‌ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అంతవరకు విద్యా వలంటీర్లను నియమించాలని కోరుతున్నారు.

ఈ నెల 8న నిర్వహించే ‘చలో డీఎస్‌ఈ’ కార్యక్రమానికి నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిరుద్యోగ జేఏసీ నేతలు, డీఎస్సీ అభ్యర్థులు పిలుపునిచ్చారు. డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదావేయాలనేది వారి ప్రధాన డిమాండ్‌గా ఉన్నది. పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో నార్మలైజేషన్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

అదేవిధంగా పీఈటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు తక్కువగా ఉన్నాయని, ఆయా అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్‌ వినిపిస్తున్నారు. అన్ని పరీక్షలను ఒకేసారి నిర్వహించకుండా విడుతల వారీగా నిర్వహించాలని కోరుతున్నారు. 5 శాతం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలంటున్నారు.

Exit mobile version