Ticket Price Hike : అఖండ 2 టికెట్ ధర పెంపు..సీఎం రేవంత్ రెడ్డి హామీపై కార్మికుల ఆశలు

అఖండ 2 టికెట్ ధరల పెంపుతో సీఎం రేవంత్ హామీ అమలు ఆశలు మళ్లీ చర్చనీయాంశం. పెరిగిన ధరలలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి అందుతుందా? కళ్లప్పగించి ఎదురుచూపులు.

Ticket Price Hike

విధాత, హైదరాబాద్ : సినిమా ధరల పెంచిన సందర్బాల్లో పెంచిన టికెట్ ధరలో 20శాతం మూవీ వెల్ఫర్ అసోసియేషన్ కు అందించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ అమలు అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంపుతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి సినిమా టికెట్ పెంపులో 20శాతం కార్మికులకు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హామీ అనంతరం ప్రభుత్వం తాజాగా అఖండ 2 సినిమా టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. పెంచిన టికెట్ ధరలో 20శాతం కార్మికుల సంక్షేమం కోసం మూవీ వెల్ఫర్ అసోసియేషన్ అందించాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. అయితే అందుకు నిర్మాతలు అంగీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఎలా ఉండనున్నాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ అమలులో వస్తుందా అని సినీ కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అఖండ 2 సినిమా టికెట్ ధరలు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50, మల్టీ ప్లెక్స్‌లో రూ.100ధర పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల ప్రీమియం షోకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ టికెట్‌ ధరను రూ.600గా నిర్ణయించారు. అయితే, పెంచిన ధరలు విడుదల తేదీ నుంచి కేవలం మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెంచిన టికెట్ ధరలలో ఉదాహారణకు రూ.600టికెట్ ధరపై 20శాతం కింద రూ.120 మూవీ వెల్ఫర్ అసోసియేషన్ కు ఇవ్వాల్సి ఉంటుంది.

గతంలో సినీ కార్మికులు వేతనాల పెంపుకు నిర్మాతలు అంగీకరించలేదు. ఈ సందర్బంగా మధ్యే మార్గంగా బెనిఫిట్స్ షోల ద్వారా వచ్చే ఆదాయంలో 20% కార్మికుల ఫెడరేషన్ కు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. ఆ లక్ష్యంతోనే ఆఖండ 2 సినిమా టికెట్ల ధరల పెంపుకు అనుమతించింది. అయితే పెంచిన టికెట్ ధరలపై 20శాతం కార్మికుల సంక్షేమానికి నిర్మాతలు అందించే విషయమై ఆసక్తి నెలకొంది.

ఇవి కూడా చదవండి :

Two Years Congress Ruling |  23 నెలల కాంగ్రెస్ పాలన.. 2.5 లక్షల కోట్లు అప్పులు! బకాయిదారులకు మొండి చెయ్యే!!
Australia vs England : యాషెస్ రెండో టెస్టులో జోరూట్ సెంచరీ..ఇంగ్లాండ్ 325/9

Latest News