విధాత : ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నేత, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోగ్రఫీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ గుమ్మడి నరసయ్య పాత్రలో నటిస్తున్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభమైంది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని ముహూర్త షాట్ కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందిని , ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ సహా పలు పార్టీల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. షూటింగ్ కు చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు.
ఐదు పర్యాయలు ఎమ్మెల్యేగా గెలిచి సాధారణ జీవితం గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పై బయోపిక్ సినిమా నిర్మిస్తున్నారు. ప్రవళిక ఆర్ట్స్ పతాకంపై పరమేశ్వర్ దర్శకత్వంలో నల్లా సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Sasirekha Song Promo | సంక్రాంతికి సిద్ధమవుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’… అలరిస్తున్న ‘శశిరేఖ’ ప్రోమో సాంగ్
Africa terrorist attack| ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
