Anasuya | ముదురుతున్న శివాజీ కామెంట్స్ వివాదం.. నా బాడీ నా ఇష్టం అంటూ అన‌సూయ ఫైర్

Anasuya | రీసెంట్‌గా నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు, మహిళలు ఎలా దుస్తులు వేసుకోవాలన్న అంశంపై ఆయన మాట్లాడిన తీరు కొందరికి నచ్చినప్పటికీ, ఎక్కువ మంది మాత్రం తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రముఖుల్లో గాయని చిన్మయి శ్రీపాద కూడా ఉన్నారు.

anasuya bharadwaj bold photos in saree

Anasuya | రీసెంట్‌గా నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. హీరోయిన్లు, మహిళలు ఎలా దుస్తులు వేసుకోవాలన్న అంశంపై ఆయన మాట్లాడిన తీరు కొందరికి నచ్చినప్పటికీ, ఎక్కువ మంది మాత్రం తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రముఖుల్లో గాయని చిన్మయి శ్రీపాద కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసే చిన్మయి, శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలను ఉద్దేశించి శివాజీ ఉపయోగించిన పదజాలం అసభ్యంగా, బాధాకరంగా ఉందని చిన్మయి పేర్కొన్నారు. మహిళలు తప్పనిసరిగా చీరలే వేసుకోవాలి, అలా చేస్తేనే గౌరవం ఉంటుందన్న భావనను ఆమె పూర్తిగా తిరస్కరించారు. గౌరవం దుస్తుల్లో కాకుండా మన ఆలోచనల్లో, ప్రవర్తనలో ఉండాలని ఆమె స్పష్టం చేశారు.

అన‌సూయ రంగంలోకి..

శివాజీ తానే జీన్స్, హూడీలు వేసుకుంటూ మహిళల విషయంలో మాత్రం సంప్రదాయం పాటించాలనడం ద్వంద్వ వైఖరని చిన్మయి విమర్శించారు. నిజంగా సంప్రదాయం కావాలంటే పురుషులు కూడా ధోతి, బొట్టు, కంకణం వంటి సంప్రదాయ గుర్తులు పాటించాలని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళలపై మాత్రమే నియమాలు విధించడం అన్యాయమని ఆమె అభిప్రాయపడ్డారు.ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై అనవసర ఒత్తిడిని పెంచుతాయని, ఇది నేటి సమాజంలో అంగీకరించలేని విషయం అని చిన్మయి అన్నారు. ప్రతి మహిళకు తనకు నచ్చినట్లు దుస్తులు వేసుకునే హక్కు ఉందని, దానిపై ఎవరికీ తీర్పు చెప్పే అధికారం లేదని ఆమె స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి మాటలను ఎదుర్కోవడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు.

ఇక అందాల ముద్దుగుమ్మ అన‌సూయ కూడా ఈ వివాదంపై స్పందించిన‌ట్టు అర్ధ‌మవుతుంది. త‌న ఇన్‌స్టా పోస్ట్ లో నా బాడీ, నా ఇష్టం .. మేము ఇలాగే ఉంటాం అంటూ ఇన్‌డైరెక్ట్‌గా శివాజీకి ఘాటు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. మ‌హిళ‌ల‌పై ఎవ‌రు త‌ప్పుగా కామెంట్ చేసిన వెంట‌నే స్పందించే అనసూయ ఇలా రియాక్ట్ అయింద‌ని అంటున్నారు. మొత్తానికి శివాజీ వ్య‌వహరం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఆమె చెప్పిన మాటలు సమాజానికి అవసరమైన నిజమని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం మహిళల గౌరవం, స్వేచ్ఛపై మరోసారి విస్తృత చర్చకు దారితీసింది.

Latest News