Anasuya | ఆయ‌న చెబితే వేసుకోవ‌డం ఆపేస్తామా ఏంటి.. శివాజీకి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చిన అన‌సూయ‌

Anasuya | టాలీవుడ్ నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమను దాటి సోషల్ మీడియా వరకు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదంగా మారాయి. పబ్లిక్ ఈవెంట్లకు వచ్చే నటీమణులు “పద్ధతిగా ఉండాలి”, చీర కట్టుకుంటే మరింత అందంగా ఉంటారని శివాజీ వ్యాఖ్యానించారు.

Anasuya | టాలీవుడ్ నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమను దాటి సోషల్ మీడియా వరకు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. నేటితరం హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదంగా మారాయి. పబ్లిక్ ఈవెంట్లకు వచ్చే నటీమణులు “పద్ధతిగా ఉండాలి”, చీర కట్టుకుంటే మరింత అందంగా ఉంటారని శివాజీ వ్యాఖ్యానించారు. గ్లామర్ ఒక స్థాయి వరకు బాగుంటుందని, కానీ హద్దులు దాటితే గౌరవం తగ్గుతుందని చెప్పారు. పాతతరం నటీమణులు సావిత్రి, సౌందర్య వంటి వారు పద్ధతిగా ఉంటూనే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ఉదాహరణలు ఇచ్చారు. నేటి తరం కూడా అందాల ప్రదర్శనకన్నా నటనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

అయితే ఈ వ్యాఖ్యల సందర్భంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా మహిళల డ్రెస్సింగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా చర్చ నడుస్తోంది. ఒక వర్గం శివాజీ మాటల్లో భావం ఉందని మద్దతు తెలుపుతుండగా, మరో వర్గం మాత్రం ఇది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణిస్తోంది.

ఈ వివాదానికి మరింత ఊపొచ్చింది గాయని చిన్మయి శ్రీపాద, యాంకర్-నటి అనసూయ స్పందనలతో. మహిళల హక్కులు, స్వేచ్ఛల విషయంలో ఎప్పుడూ స్పష్టంగా మాట్లాడే చిన్మయి, శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “మీరు జీన్స్, హూడీలు వేసుకుంటూ, మహిళలు మాత్రం సంప్రదాయం పాటించాలనడం ద్వంద్వ వైఖరి కాదా?” అంటూ ఆమె ప్రశ్నించారుఇక అనసూయ “ఇది మా బాడీ… మా ఇష్టం” అనే పోస్ట్ చేయడం ద్వారా పరోక్షంగా ఈ వివాదంలోకి వచ్చారు. ఈ పోస్ట్‌ను నెటిజన్లు శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా భావిస్తూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ఈ పోస్ట్ త‌ర్వాత అన‌సూయ డైరెక్ట్‌గా ఈ వివాదంపై స్పందించింది.

ఎవరికి న‌చ్చిన‌ట్టు వారు బ‌ట్ట‌లు వేసుకుంటారు. ఆయ‌న దృష్టిలో ఆయ‌న‌కు ఇన్‌సెక్యూరిటీ ఉన్న‌ట్టుంది. అందుకే అలాంటి రిస్ట్రిక్ష‌న్స్ పెట్టుకుంటున్నారు. ఆయ‌న చెబితే మాత్రం మ‌నం వింటామా ఏంటి?.. డ్రెస్సింగ్ అనేది ప‌ర్స‌న‌ల్. తిండి, బ‌ట్ట ఇవ‌న్నీ మ‌న‌కు న‌చ్చినట్టే ఉండాలి. మీకు బిర్యానీ తినాల‌ని ఉన్న‌ప్పుడు నేను ప‌ప్ప‌న్నం పెడితే న‌చ్చుతుందా. ఇది ప‌ర్స‌న‌ల్. అయితే ఆయ‌న అలాంటి మైండ్ సెట్‌లో ఉండి అలా ఆలోచిస్తున్నందుకు ఆయ‌న‌పై సింప‌థీ చూపిస్తున్నాను అని అన‌సూయ పేర్కొంది.

మొత్తానికి ‘90స్’ వెబ్ సిరీస్, ‘కోర్టు’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన శివాజీ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీ దశలో ఉన్నారు. కానీ అదే సమయంలో ఈ తరహా వ్యాఖ్యలతో వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెప్పే ఉద్దేశం ఏదైనా కావొచ్చు కానీ, చెప్పిన విధానం, వేదిక, పదజాలం ముఖ్యమనే చర్చ ఇప్పుడు బలంగా నడుస్తోంది. ఈ వివాదంపై శివాజీ స్పష్టత ఇస్తారా? లేక క్షమాపణ చెబుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Latest News