Avatar 3 | ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘అవతార్ 3’ మేనియా జోరుగా సాగుతోంది. హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాపై హైప్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇదే సమయంలో తాజాగా ఓ AI వీడియో నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ వైరల్ వీడియోలో అవతార్ హీరో జేక్ సల్లీ, టాలీవుడ్ టాప్ స్టార్స్‌తో కలిసి నేరుగా సెల్ఫీలు దిగినట్లు చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సెల్ఫీ తీసుకునే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో అవతార్ మూవీకి సంబంధించిన పవర్‌ఫుల్ బీజీఎం ప్లే కావడం వీడియోకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది.
వీడియోలో ‘వారణాసి’ సెట్లో రుద్రగా మహేష్ బాబు, ‘అఖండ 2’లో బాలకృష్ణ, ‘పుష్ప 2’ లుక్‌లో అల్లు అర్జున్, ‘మగధీర’ అవతార్‌లో రామ్ చరణ్, ‘కేజీఎఫ్’ స్టైల్‌లో యష్, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, ‘రోబో’గా రజనీకాంత్, ‘బాహుబలి’లో ప్రభాస్ – రానా, ‘సలార్’ లుక్‌లో ప్రభాస్, ‘విక్రమ్’లో కమల్ హాసన్, ‘కాంతార’లో రిషబ్ శెట్టి, ‘దేవర’గా ఎన్టీఆర్, ‘RRR’లో రామ్ చరణ్… ఇలా దాదాపు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అందరితో జేక్ సల్లీ సెల్ఫీ దిగుతున్నట్లు చూపించారు.ఈ AI వీడియో ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు “ఇది కూడా ఒక విజువల్ వండర్”, “అవతార్ హైప్‌ను ఇంకో లెవల్‌కు తీసుకెళ్లారు”, “జేమ్స్ కామెరూన్ చూస్తే షాక్ అవుతారు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి, ‘అవతార్ 3’ రిలీజ్ మేనియాకి ఈ AI వీడియో మరింత ఊపునిచ్చిందని చెప్పాలి. సినిమా థియేటర్లలో ఏ రేంజ్ విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతుందో అన్న అంచనాలు ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఇక గత కొద్ది రోజులుగా సెలబ్రిటీలకి సంబంధించిన ఏఐ వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.
Oreyyyyy 😭😭😭😭🤣🤣🤣🤣 pic.twitter.com/xV5N6gv5My
— 🦅 ShaRatH 🧡 (@KothaSharathKu1) December 18, 2025
