Mahesh Babu | శ్రీమ‌తికి సూప‌ర్ స్టార్ స్పెష‌ల్ విషెస్.. ఇలా చెబితే ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే…!

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబానికి పెద్దపీట వేస్తారన్న విషయం అభిమానులకు తెలిసిందే. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా, కొద్దిసేపు సమయం దొరికితే కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోతుంటారు.

Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబానికి పెద్దపీట వేస్తారన్న విషయం అభిమానులకు తెలిసిందే. భార్య, పిల్లలంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా, కొద్దిసేపు సమయం దొరికితే కుటుంబంతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోతుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నమ్రతా శిరోద్కర్‌ను మహేష్ బాబు మరింత ఆప్యాయంగా చూసుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ (జనవరి 22) నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో చేసిన హృద్యమైన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

భార్య పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నమ్రతా ఫొటోను షేర్ చేస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే ఎన్ఎస్జీ (నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని). ఎంతో గ్రేస్, ప్రేమతో ప్రతి విషయంలోనూ నా వెంట నిలుస్తున్నందుకు థ్యాంక్యూ. ఇంతకంటే జీవితంలో ఇంకేమి కావాలి” అంటూ మహేష్ బాబు ఇచ్చిన క్యాప్షన్ అభిమానుల మనసులను తాకింది. భర్తగా తన ప్రేమను ఎంతో లోతుగా వ్యక్తపరిచిన ఈ మాటలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

మహేష్ బాబు పెట్టిన ఈ పోస్ట్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. దంపతుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి “రియల్ కపుల్ గోల్స్”, “వదినమ్మా హ్యాపీ బర్త్ డే” అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో మహేష్–నమ్రత జంటపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన, ఆదర్శ దంపతులుగా వీరు మరోసారి నిలిచారు.

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ప్రేమ కథ కూడా అభిమానులకు బాగా తెలిసినదే. 2000లో విడుదలైన ‘వంశీ’ సినిమాలో హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన సమయంలో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2006 ఫిబ్రవరి 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలతో సంతోషంగా కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ మిస్ ఇండియా అయిన నమ్రతా, పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై పూర్తిగా కుటుంబానికే సమయం కేటాయిస్తున్నారు.

ఇక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్లోబ్ ట్రాటర్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ మూవీ 2027 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టైటిల్ రిలీజ్, మహేష్ బాబు లుక్ రివీల్ కోసం ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో ఈవెంట్ నిర్వహించగా, టీజర్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించారు.

Latest News