Bigg Boss 9 Guest | సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన బిగ్ బాస్ తెలుగు 9.. విన్నర్ రేస్‌తో పాటు గెస్ట్‌పై హాట్ డిస్క‌ష‌న్

Bigg Boss 9 Guest | అన్ని సీజన్లు ఒక ఎత్తైతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో ఎత్తుగా నిలిచింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు లేకున్నా కూడా ఈ సీజన్‌పై తెలుగు ప్రేక్షకులు ఎక్కువ‌ ఆసక్తి చూపించారు. గతంలో కేవలం రెండు సీజన్లకే మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు అదే స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ఈసారి మళ్లీ బిగ్ బాస్ తెలుగు 9కు దక్కినట్లు సమాచారం.

Bigg Boss 9 Guest | అన్ని సీజన్లు ఒక ఎత్తైతే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మరో ఎత్తుగా నిలిచింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు లేకున్నా కూడా ఈ సీజన్‌పై తెలుగు ప్రేక్షకులు ఎక్కువ‌ ఆసక్తి చూపించారు. గతంలో కేవలం రెండు సీజన్లకే మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు అదే స్థాయి టీఆర్పీ రేటింగ్స్ ఈసారి మళ్లీ బిగ్ బాస్ తెలుగు 9కు దక్కినట్లు సమాచారం. హౌస్‌లో జరిగిన సంఘటనలు, కంటెస్టెంట్ల మధ్య ఏర్పడిన బంధాలు, లవ్ స్టోరీస్, గొడవలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇమ్మాన్యుయేల్ ఎంటర్‌టైన్‌మెంట్, రీతూ–పవన్ లవ్ ట్రాక్, సంజనా చేసిన పనులు ఈ సీజన్‌కు ప్రత్యేక హైలైట్‌లుగా నిలిచాయి.ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలేకు అన్నీ సిద్ధమయ్యాయి. ఓటింగ్ చివరి దశకు చేరుకోగా, హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. విన్నింగ్ కప్ కోసం ప్రతీ ఒక్కరూ చివరి వరకు పోరాడుతున్నారు.

ఈ ఫైనల్ వీక్‌లో డీమన్ పవన్ గేమ్‌లో స్పష్టమైన మార్పు కనిపించడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. టైటిల్ ఎవరి చేతిలోకి వెళ్తుందన్న ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. టైటిల్ విన్నర్ రేస్ విషయానికి వస్తే, కొద్దిరోజుల క్రితం వరకు తనూజ, పవన్ కళ్యాణ్ మధ్యే గట్టి పోటీ ఉందని అందరూ భావించారు. కానీ ఫైనల్ వీక్‌లో అనూహ్యంగా డీమన్ పవన్ కూడా ఈ రేస్‌లోకి రావడంతో పోటీ త్రిముఖంగా మారింది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఈ ఆదివారం ట్రోఫీ గెలుచుకోనున్నారని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం కళ్యాణ్ పడాలే విన్నర్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఓటింగ్ కూడా కళ్యాణ్‌కే ఎక్కువగా ఉందన్న వార్తలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి.

ఇదిలా ఉండగా, గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథి ఎవరు అన్నదానిపై కూడా భారీ చర్చ సాగుతోంది. మొదట మెగాస్టార్ చిరంజీవి ఫినాలేకు రాబోతున్నారనే ప్రచారం జరిగింది. గతంలో రెండు సీజన్లకు ఆయనే ముఖ్య అతిథిగా హాజరై విన్నర్‌కు కప్ అందించారు. అయితే ఈసారి ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇవ్వాలనే ఆలోచనతో మేకర్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘రాజా సాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఫినాలే వేదికపై ఆయన హాజరు సినిమాకు మంచి ప్రమోషన్ అవుతుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్.గత సీజన్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు బిగ్ బాస్ వేదికపై కనిపించలేదు. ఈసారి నిజంగా ప్రభాస్ ఫినాలేకు వస్తే, అది బిగ్ బాస్ తెలుగు 9కి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది. మరి టైటిల్ ఎవరు గెలుస్తారు? గ్రాండ్ ఫినాలేకు అసలు అతిథి ఎవరు? అన్నది తెలియాలంటే ఫినాలే రోజు వరకు వేచి చూడాల్సిందే.

Latest News