Bigg Boss 9 Telugu | బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల.. సామాన్యుడి ప్రయాణానికి అసలైన ముగింపు

Bigg Boss 9 Telugu | 105 రోజుల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. సీజన్ ఆరంభం నుంచే వినిపించిన అంచనాల ప్రకారమే సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల, చివరికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌తో జరిగిన గ్రాండ్ ఫినాలే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపింది.

Bigg Boss 9 Telugu | 105 రోజుల పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎట్టకేలకు ముగిసింది. సీజన్ ఆరంభం నుంచే వినిపించిన అంచనాల ప్రకారమే సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల, చివరికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టాప్ 5 కంటెస్టెంట్స్‌తో జరిగిన గ్రాండ్ ఫినాలే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపింది. ఈ ఫైనల్ రేసులో సంజన గల్రానీ టాప్ 5లో నిలవగా, జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన ఇమ్మాన్యుయెల్ టాప్ 4తో సరిపెట్టుకున్నారు.టాప్ 3కు చేరుకున్న వారు కళ్యాణ్ పడాల, డిమాన్ పవన్, తనూజ.

సామాన్యుడికే కిరీటం..

ఈ దశలో ఆట మరింత ఆసక్తికరంగా మారింది. టాప్ 3లో తన పొజిషన్‌ను అర్థం చేసుకున్న డిమాన్ పవన్, వ్యూహాత్మకంగా వ్యవహరించి రూ.15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకుని హౌస్ నుంచి బయటికి వచ్చాడు. దీంతో టైటిల్ ఫైట్ తనూజ, కళ్యాణ్ పడాల మధ్యకు పరిమితమైంది. ఎవరు విన్నర్ అవుతారనే ఉత్కంఠ చివరి క్షణం వరకు కొనసాగింది. సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల వృత్తిరీత్యా భారత ఆర్మీ అధికారి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, మొదట్లో తనూజ వెనకే తిరుగుతూ లవర్ బాయ్ ఇమేజ్‌తో కనిపించారు. అయితే అదే ఇమేజ్‌ను తర్వాత సెంటిమెంట్‌గా మార్చుకుని, తన ఆటను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లారు.

గ్రాండ్ ఫినాలేకు ముందు జరిగిన ఓ టాస్క్‌లో గాయపడిన కళ్యాణ్ పడాల, ఆ పరిస్థితిని కూడా తనకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యాడనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆ సానుభూతి ఓట్లుగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు తనూజ, కళ్యాణ్ ఇద్దరికీ భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఫైనల్‌లో ఓట్లు చీలిపోయాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడైన కళ్యాణ్‌కు నష్టం జరగాల్సి ఉండగా, పరిస్థితి తారుమారైంది.కొంతమంది సెలబ్రిటీలు, తనూజకు అనుకూలంగా ఆమె పీఆర్ టీమ్ బలంగా పనిచేస్తోందని సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. అదే సమయంలో దీనికి ప్రతిస్పందనగా కళ్యాణ్‌కు భారీగా ఓట్లు పడినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య చివరికి ప్రేక్షకుల తీర్పు కళ్యాణ్ పడాలకే అనుకూలంగా మారింది. మొత్తంగా సామాన్యుడిగా మొదలైన కళ్యాణ్ పడాల ప్రయాణం, బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్‌తో ఘనంగా ముగియడంతో ఈ సీజన్ బిగ్ బాస్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

Latest News