Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రస్తుతం అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న AA22 x A6 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల వరుసగా రెండు భారీ తెలుగు ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంతో, ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న Kalki 2898 AD సీక్వెల్, ప్రభాస్ -సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పిరిట్ చిత్రం నుండి దీపికా తప్పుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. ఎట్టకేలకి ఆ కామెంట్స్‌కి దీపికా స్పందించింది. హార్పర్ బజార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కారణాలను వెల్లడించారు.
కారణాలు ఇవే..
ఇప్పుడు నాకు సినిమా బడ్జెట్, కలెక్షన్స్, 100 కోట్లు / 500–600 కోట్ల సినిమాలా అనేది ముఖ్యం కాదు. ఏ పని ఎందుకు చేయాలి… ఎందుకు చేయకూడదు అనేది నాకు ఇప్పుడు చాలా ముఖ్యం అని పేర్కొంది. దీపికా మాటల్లో ఇది పూర్తిగా పారితోషికం, షెడ్యూల్ సమస్య, బడ్జెట్ ఇష్యూ కాదు అని స్పష్టమైంది.మరోవైపు దీపికా పెద్ద చిత్రాల వర్క్ ఎన్విరాన్‌మెంట్ ఎలా ఉంటుందో కూడా వివరించారు. చాలా మంది ఎక్కువ పారితోషికం ఇవ్వడం సరిపోతుందని అనుకుంటారు. కానీ అలా కాదు. పెద్ద సినిమాలు చాలా ఎక్కువ కష్టమైన పని. మంచి పని వాతావరణం, ఆరోగ్యం చాలా ముఖ్యమైనవి. రోజుకు ఎనిమిది గంటలపాటు పనిచేస్తేనే మంచి అవుట్‌పుట్ ఇవ్వగలం అని తెలియజేసింది.
అంటే భారీ ప్రాజెక్టులు శారీరకంగా, మానసికంగా ఎంత స్ట్రెస్ ఇస్తాయనేది దీపికా మాటలని బట్టి అర్థమవుతోంది. అయితే దీపికా పదుకొణే భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలు, భారీ VFXపై కాకుండా స్వీయ ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, క్వాలిటీ అవుట్‌పుట్‌పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఈ కామెంట్స్‌తో దీపికా రెండు భారీ తెలుగు ప్రాజెక్టుల నుంచి ఎందుకు తప్పుకున్నారో అందరికి అర్ధమైంది. ఇక స్పిరిట్‌లో దీపికా స్థానంలో బాలీవుడ్ నటి త్రిప్తి డిమ్రిను ఫిక్స్ చేశారు.ఇక Kalki 2898 AD సీక్వెల్లో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారు అన్నది ఇంకా ప్రకటించలేదు. ఈ విషయంపై ప్రేక్షకులు భారీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
