Jabardasth Naresh | జబర్దస్త్ నరేష్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా.. అస‌లెవ‌రు ఈమె?

Jabardasth Naresh | జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నరేష్ ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్లు, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు. చూడటానికి చాలా చిన్న‌గా క‌నిపించిన , తన టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు.

Jabardasth Naresh | జబర్దస్త్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ నరేష్ ప్రస్తుతం టీవీ షోలు, ఈవెంట్లు, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నాడు. చూడటానికి చాలా చిన్న‌గా క‌నిపించిన , తన టాలెంట్‌తో పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ ఆసక్తికర విషయాలతో పాటు, తన పెళ్లి గురించి కూడా స్పందించాడు. కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ షోలో ఓ ఎపిసోడ్‌లో నరేష్‌కు ఒక అమ్మాయితో ‘పెళ్లి చూపులు’ జరిగినట్టు స్కిట్ చూపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ ఎపిసోడ్ వైరల్ కావడంతో నిజంగానే ఆ అమ్మాయితో నరేష్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై నరేష్ తాజాగా స్పష్టత ఇచ్చాడు.

పెళ్లి చేసుకోబోతున్నాడా?

ఆ వార్తలు కేవ‌లం ఆ ఎపిసోడ్ వరకే అని నరేష్ క్లారిటీ ఇచ్చాడు. “ఆ అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. ఆ రోజు షూటింగ్ కోసం మొదటిసారి పరిచయం అయ్యింది. స్కిట్ కోసం చెప్పడంతో ధైర్యంగా చేసింది. షోకి వచ్చినవారంతా అలాగే చేస్తారు. ప్రోమోలు చూసి నమ్మకూడదు… ఎపిసోడ్ చివర్లోనే చెప్పాం అది కేవలం స్కిట్ మాత్రమే అని,” అన్నారు. అలాగే పెళ్లి విషయంలో తన కోరికను కూడా వెల్లడించాడు. “నాకు పెళ్లి చేసుకుని పిల్లలని క‌నాల‌ని ఉంది… నాకు ఫ్యామిలీ ఉండాలి. నేను చేసుకోబోయే అమ్మాయి నాకంటే ఒక అడుగున్నర ఎక్కువ హైట్ ఉంటే చాలు. మా అమ్మానాన్నలను బాగా చూసుకోవాలి. నన్ను అర్ధం చేసుకోవాలి. మా పేరెంట్స్ కి ఇప్పుడు రెస్ట్ ఇచ్చాను. నేనే కష్టపడుతున్నా. కట్నం కూడా వద్దు అని నరేష్ చెప్పాడు.

జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా పనిచేయడంపై నరేష్ స్పందిస్తూ ..నాకు టీమ్ లీడర్ ట్యాగ్‌ అవసరం లేదు. నేను ఇప్పటికే 36 స్కిట్స్‌కు టీమ్ లీడర్‌గా చేశాను… అది నిజంగా నరకం చూసినట్టే. నాలుగు రోజుల ముందే లైన్ చెప్పాలి, కాస్ట్యూమ్, ప్రాపర్టీస్ అన్ని చేయాలి. లైన్ ఓకే కాకపోతే మళ్లీ తిరగాలి… ఇవన్నీ చాలా కష్టమైన పనులు. ఇటీవల రిక్వెస్ట్ చేస్తే కొన్ని స్కిట్స్‌ చేస్తున్నాను కానీ అది తాత్కాలికం మాత్రమే. అలాగే జబర్దస్త్‌లో తనపై కంప్లైంట్‌ ఇచ్చిన విషయాన్ని కూడా నరేష్ ప్రస్తావించాడు. “నా దగ్గరే పనిచేసే వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు. ‘అతనికి ఎందుకు ఎక్కువ ఎపిసోడ్స్ ఇస్తారు?’ అని మాట్లాడుకున్నారు. ఆ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఇకముందు జాగ్రత్తగా ఉంటాను అని చెప్పాడు. దీంతో జబర్దస్త్‌పై నరేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Latest News