Manchu Lakshmi | మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మీ చేసే కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంటాయి. ఒకప్పుడు నటిగా అలరించిన మంచక్క ఇప్పుడు కాస్త స్లో అయింది. సినిమాలతో అంత సందడి చేయకపోయిన ఇంటర్వ్యూలలో అందరు ఆశ్చర్యపోయే కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మంచు లక్ష్మీ .. నమ్రతా, మహేష్ సితారను బయటకు తీసుకురాకపోతే ఇద్దరినీ కొట్టేస్తాను!” అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబును ఈ స్థాయిలో టీజ్ చేయడం, ఆప్యాయంగా హెచ్చరించడం చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యంతోపాటు చిరునవ్వులు చిందిస్తున్నారు.
సితారకు స్వేచ్ఛ ఇవ్వాలని లక్ష్మి డిమాండ్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన లక్ష్మి మంచు, సితార ఘట్టమనేనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మహేష్–నమ్రతలకు సూచించింది. నమ్రత ఆధునిక భావాలు ఉన్న మహిళ. సితారకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. లేకపోతే మహేష్, నమ్రత ఇద్దరినీ కొట్టేస్తా!” అని నవ్వుతూ చెప్పిన ఆమె వ్యాఖ్యల వెనుక స్పష్టమైన సందేశం ఉంది. టాలీవుడ్‌లో స్టార్ కుమారులకే ఎందుకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు? స్టార్ కుమార్తెలకు ఎందుకు ఇవ్వరు అనే ఉద్దేశంతో ఆమె ఇలా కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది . లక్ష్మి అభిప్రాయం ప్రకారం, ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చే స్టార్స్ కుమారుల సంఖ్య ఎక్కువ. కానీ కుమార్తెల రాక చాలా అరుదుగా కనిపిస్తుంది.
శ్రుతి హాసన్, లక్ష్మి మంచు ..ఇలా కొద్దిమంది మాత్రమే హీరోయిన్లుగా సక్సెస్ సాధించగా, మిగతా వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో సితార ఘట్టమనేని సామర్థ్యం గురించి లక్ష్మి ప్రశంసలు కురిపించింది. సితార ఇప్పటికే డాన్స్ వీడియోలు, ఫ్యాషన్ క్లిప్స్, సోషల్ మీడియాలో ఉన్న ప్రభావంతో యువతలో స్టార్‌లా నిలుస్తోందని పేర్కొంది.
మహేష్–నమ్రత స్పందన?
ఇప్పటివరకు మంచు లక్ష్మి వ్యాఖ్యలపై మహేష్ లేదా నమ్రత స్పందించలేదు. అయితే ఇటీవల ‘వారణాసి’ ఈవెంట్‌లో సితార పాల్గొనడం, రోజు రోజుకీ పెరుగుతున్న ఆమె ఫాలోయింగ్ చూస్తే భవిష్యత్‌లో సిల్వర్‌స్క్రీన్‌పై చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది.
‘పితృస్వామ్యాన్ని ఛేదించాలి’ – లక్ష్మి సందేశం
“పితృస్వామ్యాన్ని తొలగించలేను… కానీ దానిని ఛేదించి నా మార్గం నేను సృష్టించాలి” అన్న మంచు లక్ష్మి మాటలు ప్రస్తుతం మహిళా సాధికారత చర్చల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌కి సితార ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది తెలియదు కానీ మంచు లక్ష్మి మాటలు మాత్రం ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకసారి ఆలోచింపజేశాయి.
