Prabhas | ‘డార్లింగ్’ నుంచి ‘ది రాజా సాబ్’ వరకు.. ప్రభాస్ లుక్స్‌పై అభిమానుల్లో ఆందోళన

Prabhas |ఆరడుగుల ఎత్తు, హాలీవుడ్ హీరోలను తలపించే కటౌట్‌, తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో విజిల్స్ వినిపించే ప్రెజెన్స్ ఇవన్నీ కలిపితే ప్రభాస్. ‘వర్షం’ నుంచి ‘బాహుబలి’, ‘సాహో’ వరకూ ఆయన లుక్స్, స్టైల్ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌లా మారాయి.

Prabhas |ఆరడుగుల ఎత్తు, హాలీవుడ్ హీరోలను తలపించే కటౌట్‌, తెరపై కనిపిస్తే చాలు థియేటర్‌లో విజిల్స్ వినిపించే ప్రెజెన్స్ ఇవన్నీ కలిపితే ప్రభాస్. ‘వర్షం’ నుంచి ‘బాహుబలి’, ‘సాహో’ వరకూ ఆయన లుక్స్, స్టైల్ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌లా మారాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ తెరపై కనిపిస్తే వచ్చే మ్యాజిక్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదన్నది అభిమానుల మాట. అయితే ఇటీవల కాలంలో అదే మ్యాజిక్ తగ్గిందా? అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది.

జనవరి 9న విడుదలైన ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ లుక్స్‌పై ట్రోలింగ్ పెరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన మిర్చి టైప్ డ్రెస్సింగ్ స్టైల్‌లో కనిపించినప్పటికీ, గతంలో ఉన్న ఛార్మ్ కనిపించలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ మార్పులు, కొన్ని సన్నివేశాల్లో గ్లాసెస్ ఎక్కువగా వాడటం వంటి అంశాలు ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించాయి. ఇది తొలిసారి కాదన్నదే మరో చర్చ. ‘రాధేశ్యామ్’లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నా ప్రభాస్ ఫేస్‌లో మార్పు స్పష్టంగా కనిపించిందని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ‘ఆదిపురుష్’ విషయంలో అయితే సినిమా మొత్తం వివాదాల మధ్యే నిలిచింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’లో ప్రభాస్ మాస్, మ్యాన్లీగా కనిపించినా ‘డార్లింగ్’ రోజుల లుక్ మాత్రం తిరిగి రాలేదని కొందరి అభిప్రాయం.

‘కల్కి 2898 AD’లో కొన్ని ఫ్రేమ్స్‌లో ప్రభాస్ లుక్ నచ్చిందని చెప్పినా, కొన్ని చోట్ల డూప్ వాడకంపై వచ్చిన వీడియోలు మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ‘ది రాజా సాబ్’తోనూ అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందలేకపోయారు. ఇప్పుడు ప్రభాస్ భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా ఇదే టెన్షన్ కనిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ‘స్పిరిట్’ లాంటి సినిమాల్లో ఆయన లుక్ ఎలా ఉండబోతుందన్నదే ప్రధాన చర్చ. ముఖ్యంగా ‘స్పిరిట్’లో పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తారని వార్తలు రావడంతో, మునుపటిలా లేడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా చూస్తే, ప్రభాస్‌పై అభిమానుల ప్రేమలో ఏమాత్రం తగ్గుదల లేదు. కానీ ‘డార్లింగ్’, ‘మిర్చి’ రోజుల్లో కనిపించిన ఆ ప్రత్యేక ఛార్మ్ మళ్లీ చూస్తామా? అనే ఆశతో పాటు భయం కూడా ఫ్యాన్స్‌లో నెలకొంది. ప్రభాస్ నుంచి వచ్చే తదుపరి సినిమాలే ఈ సందేహాలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది.

Latest News