Roshan | సినీ ఇండస్ట్రీలో తల్లిదండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సెలబ్రిటీలు ఎక్కువగా ఉంటారు. అయితే కొంతమంది తల్లిదండ్రుల గుర్తింపును కొనసాగిస్తూ, మరికొంతమంది తల్లిదండ్రులను మించిన పాపులారిటీ సాధిస్తారు. అలాంటి కొత్తతరం హీరోలలో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రోషన్, రుద్రమదేవి సినిమాలో చిన్న పాత్రలో కనిపించి, ఆ తర్వాత నిర్మల కాన్వెంట్ సినిమాలో లీడ్ రోల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన తండ్రి శ్రీకాంత్ 1996లో నటించిన పెళ్లి సందడికి ఆధ్యాత్మిక సీక్వెల్‌గా 2021లో రూపొందించిన పెళ్లి సందD ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.
నాలుగేళ్ల గ్యాప్ తర్వాత, ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాతో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సక్సెస్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రోషన్ మేకకు తన బ్యానర్‌లో సినిమా అవకాశం అందించారు. అంతేకాదు, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో కూడా మరో ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదిరింది. వరుసగా అగ్ర నిర్మాణ సంస్థలతో అవకాశాలు రావడంతో రోషన్ క్రేజ్ టాలీవుడ్‌లో మరింత పెరిగిపోయిందని చెప్పాలి.
ప్రేక్షకులను ఆకట్టే విభిన్న కథలను ఎంచుకుని, సక్సెస్ సాధించడం ద్వారా రోషన్ భవిష్యత్తులో మరిన్ని బడా ప్రాజెక్టులు తలుపు తట్టే అవకాశం ఉన్నట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన సక్సెస్, వరుస అవకాశాలను బట్టి రోషన్ తన తండ్రి శ్రీకాంత్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ సంపాదిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక రోషన్ ఈ క్రేజ్‌ను నిలబెట్టుకోగలడా, అది కాలమే చెప్పనుంది.
