Sameera Reddy | ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం… కన్యాదానం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

Sameera Reddy | ‘అశోక్’, ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సమీరా రెడ్డి, బాలీవుడ్‌లో మాత్రం బోల్డ్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Sameera Reddy | ‘అశోక్’, ‘నరసింహుడు’, ‘జై చిరంజీవ’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి చిత్రాల్లో నటించి సౌత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి సమీరా రెడ్డి, బాలీవుడ్‌లో మాత్రం బోల్డ్ రోల్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అక్షయ్ వర్దే. ఈ ప్రేమకథ కూడా సినిమా లా సాగ‌డం విశేషం.

‘తేజ్’ మూవీ ప్రమోషన్స్‌… అక్కడే మొదలైన ప్రేమకథ

‘తేజ్’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా సమీరా ఒక బైక్ నడిపే సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆ బైక్‌పై ఆమె వెనుక కూర్చొన్నది బిజినెస్‌మ్యాన్ అక్షయ్ వర్దే. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు 2014లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

అక్షయ్ వర్దే – విజయ్ మాల్యాకు బంధువు!

ఇక్కడ చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే… అక్షయ్ వర్దే ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యాకు దగ్గరి బంధువు. స‌మీరా రెడ్డి పెళ్లిలో ఈ సంబంధం పెద్ద పాత్ర పోషించింది.

విజయ్ మాల్యా చేతుల మీదుగా ‘కన్యాదానం’

సమీరా రెడ్డి తండ్రి లేకపోవడంతో, మహారాష్ట్రియన్ సంప్రదాయం ప్రకారం వధువు తల్లి కుటుంబం నుంచి ఒక దగ్గరి పెద్ద మనిషి కన్యాదానం చేయాలి. అందుకే ఆమె తల్లికి అత్యంత దగ్గరి బంధువు అయిన విజయ్ మాల్యా సమీరా రెడ్డికి కన్యాదానం చేసిన వ్యక్తిగా నిలిచారు. ఈ విషయాన్ని ఇటీవల సమీరా స్వయంగా వెల్లడించింది. “మా అమ్మ వైపు నుంచి మా పెళ్లికి వచ్చిన ఏకైక వ్యక్తి విజయ్ మాల్యానే. ఆయనే నా కన్యాదానం చేశాడు. మా పెళ్లి చాలా సింపుల్‌గా, కొద్దిమంది స‌మ‌క్షంలో జ‌రిగింది అని సమీరా రెడ్డి పేర్కొంది.

ముంబైలో మహారాష్ట్రియన్ పద్దతిలో గ్రాండ్ వెడ్డింగ్

2014లో ముంబైలో సంప్రదాయ మహారాష్ట్రియన్ ఆచారంలో ఈ జంట వివాహం జరిగింది. స్నేహితులు, బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారని సమీరా చెబుతోంది. ప్రస్తుతం సమీరాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉంటుంది. కుటుంబంతో ఫన్నీ వీడియోలు, ఫిట్‌నెస్‌, బ్యూటీ టిప్స్, తన తల్లితో కలిసి చేసే వీడియోలు ద్వారా సమీరా ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం సమీరా రెడ్డి స్టార్‌గానే కొనసాగుతోంది.

Latest News