Site icon vidhaatha

Health Tips | బిర్యానీలో నిమ్మరసం పిండుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

Health Tips : సాధారణంగా నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఒంట్లో వేడిని తగ్గించడానికి, డీహైడ్రేషన్‌కు గురైన బాడీని వెంటనే హైడ్రేట్‌ చేయడానికి నిమ్మరసాన్ని వినియోగిస్తుంటారు. పరగడుపునే నిమ్మరసంతో షర్బత్‌ చేసుకుని తాగితే కడుపులోని మలినాలు సులువుగా బయటికి పోతాయంటారు. అదేవిధంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా నిమ్మ పులుపు తోడైతే ఆ ఆహారానికి కమ్మదనం వస్తుంది. కానీ ఈ నిమ్మరసం కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిస్తే విషపూరితం అయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి నిమ్మరసంతో కలపకూడని ఆ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలు, పాల సంబంధ ఉత్పత్తులతో నిమ్మరసాన్ని కలుపగూడదు. ఏ రకమైన పాల ఉత్పత్తులతో కూడా నిమ్మకాయను కలిపి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పాలు, నిమ్మరసం ఒకేసారి తాగడం ఆరోగ్యానికి హానికరమని, దాంతో గుండెల్లో మంటగా అనిపించడం, వాంతులు అవడం లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

అదేవిధంగా మసాలా వంటకాల్లో కూడా నిమ్మరసాన్ని ఉపయోగించడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీలు, ఇతర మసాలా ఆహారాల్లో ఘాటును భరించడం కోసం, పుల్లని రుచి కోసం చాలా మంది నిమ్మరసాన్ని పిండుకుంటారు. కానీ దానివల్ల ఎసిడిటీ బారినపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే నిమ్మకాయలో సిట్రిక్‌ యాసిడ్‌ ఉండటమేగాక ఆ నిమ్మకాయ పిండుకోవడంవల్ల మసాలా ఘాటు తగ్గుతుంది. దాంతో అతిగా మసాలాను తీసుకుంటాం. ఇది ఎసిడిటీకి కారణమవుతుంది.

రెడ్‌ వైన్‌ తీసుకునేటప్పుడు కూడా నిమ్మకాయను ఏ రూపంలోనూ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసం వైన్ రుచిని, వాసనను చెడగొట్టడమేగాక ఆరోగ్యానికి హాని చేస్తుంది. పెరుగు, చల్ల లాంటి పాల ఉత్పత్తులతో కూడా నిమ్మరసం తీసుకోవడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం పాల ఉత్పత్తులతో నిమ్మరసం జోడించడం ఆరోగ్యానికి హానికరం. నిమ్మరసం శరీరంలో ఎసిడిటీని కలిగిస్తుంది.

Exit mobile version