Site icon vidhaatha

బరువు తగ్గడానికి ఇంత సులభమైన మార్గం కూడా ఉన్నదా?

న‌డ‌క.. ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్ర‌తి రోజూ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోతోంది. త‌ద్వారా గుండె జ‌బ్బులు, బీపీ, షుగ‌ర్ వంటి వ్యాధులు మ‌న ద‌రి చేర‌వు. రెగ్యుల‌ర్‌గా న‌డ‌వ‌డం వ‌ల్ల మొత్తం శ‌రీరం ఆరోగ్యంగా మారుతుంది. అంతేకాకుందా జీవ‌క్రియ రేటు కూడా పెరుగుతుంది. కండ‌రాలు కూడా బ‌లంగా మారుతాయి. ఇవ‌న్నీ వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని అనేక ప‌రిశోధ‌న‌ల్లో కూడా తేలింది.

బరువు త‌గ్గాల‌నుకునే వారు వ్యాయామం చేయ‌డంతో పాటు న‌డ‌క‌ను త‌ప్పనిస‌రి చేసుకోవాల‌ని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే న‌డ‌క హార్మోన్ల‌ను కంట్రోల్ ఉంచుతుంది. ఆక‌లిని త‌గ్గించ‌డంలో కూడా స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా ప్ర‌తి రోజూ వాకింగ్‌కు వెళ్లే వ్య‌క్తులు ఫిట్‌గా ఉంటారు కూడా. స‌మ‌తుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్య‌క‌ర‌మైన న‌డ‌క‌ను అల‌వాటు చేసుకుంటే కేల‌రీల‌ను బ‌ర్న్ చేయ‌డంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తోంది.


అయితే వాకింగ్ చేసేందుకు స‌మ‌యాన్ని ఎంచుకోవ‌డం కూడా ముఖ్యం. ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో వాకింగ్ చేస్తే మంచిది. ఒక వ్య‌క్తి స‌మ‌తుల్య ఆహారం తీసుకుని రోజుకు 5 నుంచి 10 కిలోమీట‌ర్ల దూరం వాకింగ్ చేసిన‌ట్లు అయితే ఊహించ‌ని రీతిలో బ‌రువు త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు సూచిస్తున్నాయి.


రోజూ గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో చురుకుగా నడిచినట్లయితే గుండె ఆరోగ్యం మెరగవ్వడంతోపాటు కొవ్వు కూడా క‌రిగిపోతోంది. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్ళు బాగా పని చేస్తాయి. శరీరం మొత్తం ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వారానికి కనీసం ఐదు సార్లు నడవడం లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే పార్కులో నడిస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.


బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం వారానికి 75 నిమిషాలు మితమైన శారీరక శ్రమ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 17 శాతం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ 7 శాతం తగ్గించడానికి అవకాశం ఉంటుందని కనుగొన్నారు. తల, మైలోయిడ్ లుకేమియా, మైలోమా, గ్యాస్ట్రిక్ కార్డియా క్యాన్సర్లు 14-26 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. ఇక ఊపిరితిత్తులు, కాలేయం, ఎండోమెట్రియల్, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లు 3-11 శాతం తక్కువ ప్రమాదం కలిగి ఉంటుందని తెలిపారు.

Exit mobile version