Health Tips | మొక్క‌జొన్న కంకుల‌ను.. డ‌యాబెటిస్ ఉన్న‌వారు తినొచ్చా..?

Health Tips | వ‌ర్షాకాలంలో మొక్క‌జొన్న భ‌లే ఫేమ‌స్‌.. గ్రామాల నుంచి మొద‌లుకొంటే ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా మొక్క‌జొన్న కంకులు ద‌ర్శ‌నమిస్తున్నాయి. రోడ్ల వెంబ‌డి మ‌క్క కంకుల‌ను కాల్చి, ఉడ‌క‌బెట్టి అమ్ముతున్నారు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణానికి ఆ మొక్క‌జొన్న కంకుల‌ను తింటుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. పోష‌కాలు పుష్క‌లంగా ఉండే ఈ మొక్క‌జొన్న కంకుల‌ను తినేందుకు అన్ని వ‌య‌సుల వారు ఇష్ట‌ప‌డుతారు. అయితే డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు మ‌క్క కంకుల‌ను తినొచ్చా? అంటే వ‌ద్ద‌నే సూచిస్తున్నారు ఆరోగ్య […]

  • Publish Date - August 9, 2023 / 06:32 AM IST

Health Tips | వ‌ర్షాకాలంలో మొక్క‌జొన్న భ‌లే ఫేమ‌స్‌.. గ్రామాల నుంచి మొద‌లుకొంటే ప‌ట్ట‌ణాల వ‌ర‌కు ఎక్క‌డ చూసినా మొక్క‌జొన్న కంకులు ద‌ర్శ‌నమిస్తున్నాయి. రోడ్ల వెంబ‌డి మ‌క్క కంకుల‌ను కాల్చి, ఉడ‌క‌బెట్టి అమ్ముతున్నారు. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణానికి ఆ మొక్క‌జొన్న కంకుల‌ను తింటుంటే ఆ రుచి వేరేగా ఉంటుంది. పోష‌కాలు పుష్క‌లంగా ఉండే ఈ మొక్క‌జొన్న కంకుల‌ను తినేందుకు అన్ని వ‌య‌సుల వారు ఇష్ట‌ప‌డుతారు. అయితే డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు మ‌క్క కంకుల‌ను తినొచ్చా? అంటే వ‌ద్ద‌నే సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మొక్క‌జొన్న త‌క్ష‌ణ శ‌క్తిని ఇస్తుంది. మొక్క‌జొన్న‌లో విట‌మిన్ ఏ, బీ, ఈ, కే లాంటి విట‌మిన్ల‌తో పాటు ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నిషీయం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. త‌క్కువ కొవ్వు ఉండటంతో పాటు క‌డుపు నిండిన భావ‌నను క‌లిగించ‌వు. కాబ‌ట్టి కార్న్‌ను అన్నింటి కంటే మెరుగైన స్నాక్‌గా ఎంపిక చేసుకోవ‌చ్చు.

అయితే ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో పోల్చితే ఇందులో కార్బొహైడ్రేట్లు కూడా ఎక్కువే. అందుకే మ‌క్క కంకుల‌కు డ‌యాబెటిస్‌తో బాధ‌ప‌డేవారు దూరంగా ఉండాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన‌కూడ‌ద‌ని కాదు.. కానీ త‌క్కువ మోతాదులో తీసుకోవ‌చ్చు. దానికి త‌గ్గ‌ట్టు మిగ‌తా ఆహారాన్ని స‌మ‌తుల్యం చేసుకోవాలి. మ‌క్క కంకుల‌ను తిన‌డం వ‌ల్ల ఆహారం మంచిగా జీర్ణ‌మ‌వుతుంది. బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు మోతాదు మీద దృష్టి ఉంచితే మంచిది.

Latest News