Site icon vidhaatha

Dry fish | వాసనకు భయపడి వ్వాక్‌ ఎండు చేపలు అంటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోవాల్సిందే..!

Dry fish : చాలామందికి ఎండు చేపలు తినడం ఇష్టం ఉండదు. ఎండు చేపల వాసనకు భయపడి వాటిని దూరం పెడుతుంటారు. కానీ ఎండు చేపల రుచి తెలిసిన వాళ్లు ఆ వాసనను కూడా ఆస్వాదిస్తారు. కమ్మకమ్మగా వండుకుని ఆరగిస్తారు. వాస్తవానికి ఎండు చేపలలో బోలెడు పోషకాలుంటాయని, ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఎండు చేపలలో ప్రోటీన్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్ బి12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, సోడియం ఉంటాయి. ఎండు చేపలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండు చేపలలో ఉండే పోషకాల కారణంగా శరీరం పొడిబారకుండా ఉంటుంది. ఎండు చేపలు నరాల సమస్యలను నివారించడానికి బాగా పనిచేస్తాయి.

కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయి. ఎండు చేపలు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. ఎండు చేపలలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను మెరుగుపరచడంతోపాటు, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఎండు చేపలలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

ఎండు చేపలలో ఫాస్ఫరస్, కాల్షియం పుష్కలంగా ఉండడంవల్ల ఇవి మన శరీరంలోని ఎముకలకు పుష్టిని అందిస్తాయి. ఎండు చేపలను తింటే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దంతాలు బలోపేతం అవుతాయి. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి12 శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కేవలం వాసన కారణంగా ఎండు చేపలను తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా నష్టమే తప్ప లాభం లేదు.

Exit mobile version