Site icon vidhaatha

love | మెరుగైన‌ శృంగారం పురుషుల ఆయుష్షును పెంచుతుంద‌ట‌..!

Love |

శృంగారం స్త్రీ, పురుషుల మ‌ధ్య అనుభూతిని ఇవ్వ‌డ‌మే కాదు.. ఆయుష్షును కూడా పెంచుతుంద‌ట‌. అది కూడా మెరుగైన శృంగారంతోనే ఇది సాధ్య‌మ‌ని జ‌పాన్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. మెరుగైన శృంగార జీవితాన్ని గ‌డిపే మ‌ధ్య వ‌య‌స్కులైన పురుషులు ఎక్కువ కాలం జీవించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు.

య‌మ‌గ‌ట యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ద‌శాబ్ద కాలం పాటు ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించారు. 40 ఏండ్లు పైబ‌డిన 8,558 మంది పురుషులు, 12,411 మంది మ‌హిళ‌ల‌పై ప‌రిశోధ‌కులు అధ్య‌య‌నం చేసి ఆయుష్షుకు, శృంగార జీవితానికి సంబంధం ఉన్న‌ద‌ని గుర్తించారు.

లైంగిక ఆస‌క్తి త‌క్కువ‌గా ఉన్న పురుషులు(40 ఏండ్లు పైబ‌డిన వారు) త్వ‌ర‌గా చ‌నిపోతున్న‌ట్లు గుర్తించారు. వీరు క్యాన్స‌ర్ బారిన ప‌డ‌టం లేదా గుండె స‌మ‌స్య‌ల బారిన ప‌డి చ‌నిపోతున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే గుండె జ‌బ్బుల‌తో మ‌ర‌ణించే ముప్పు 1.36 రెట్లు, క్యాన్స‌ర్ జ‌బ్బుల‌తో మ‌ర‌ణించే ముప్పు 1.96 రెట్లు అధికంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

మెరుగైన శృంగారం చేయ‌డంతో.. మాన‌సిక ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అంతేకాకుండా దంప‌తుల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని ప‌రిశోధకులు తెలిపారు. ఇక మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వంటి వారిలో లైంగిక ఆస‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌ట్లు తేలింది.

ఎందుకంటే ఈ రెండింటి వ‌ల్ల మాన‌సికంగా ఒత్తిడికి గురై లైంగిక చ‌ర్య‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు నిర్ధారించారు. శృంగారం ప‌ట్ల ఆస‌క్తి లేని పురుషులు త్వ‌ర‌గా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్న‌ట్లు తేలింది.

మెరుగైన శృంగారం చేయ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగ‌వుతుంది. సుఖంగా నిద్రించొచ్చు. రోగ నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంది. గుండె స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. అయితే లైంగిక ఆస‌క్తి లేని మ‌హిళ‌ల‌కు ఎలాంటి ప్ర‌మాదాలు లేవ‌ని నిర్ధారించారు.

Exit mobile version