Testosterone | అంగ‌స్తంభ‌న లోపం గుండె పోటుకు సంకేత‌మా..? టెస్టోస్టీరాన్ త‌గ్గుద‌లే కార‌ణ‌మా..?

Testosterone | మానవ శ‌రీరం ఎదుగుద‌ల‌కు హార్మోన్లు చాలా ముఖ్యం. హ్మార్మోన్ల ప్ర‌భావం వ‌ల్లే స్త్రీ, పురుషుల శ‌రీరంలో ఎదుగుద‌ల ఉంటుంది. హార్మోన్ల ఉత్ప‌త్తిలో అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.

  • Publish Date - May 23, 2024 / 11:55 AM IST

Testosterone | మానవ శ‌రీరం ఎదుగుద‌ల‌కు హార్మోన్లు చాలా ముఖ్యం. హ్మార్మోన్ల ప్ర‌భావం వ‌ల్లే స్త్రీ, పురుషుల శ‌రీరంలో ఎదుగుద‌ల ఉంటుంది. హార్మోన్ల ఉత్ప‌త్తిలో అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డితే అనేక స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అయితే హార్మోన్లు అనేవి ఒక రకమైన రసాయనాలు. ఎండోక్రైన్ గ్రంథులు హ్మార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తాయి. ఉత్ప‌త్తైన హార్మోన్లు ర‌క్తం ద్వారా శ‌రీరంలోని వివిధ భాగాల‌కు స‌ర‌ఫ‌రా అవుతాయి. దీంతో అవ‌య‌వాల ప‌నితీరును ఈ హార్మోన్లు మెరుగుప‌రుస్తాయి. త‌ద్వారా శ‌రీర అభివృద్ధి కూడా జ‌రుగుతుంది. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఈ హార్మోన్ల‌లో హెచ్చుత‌గ్గులు సంభ‌విస్తుంటాయి. దీన్నే హార్మోన్ల అసమతుల్యత అంటారు. ఈ అస‌మ‌తుల్య‌త‌ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

అయితే పురుషుల్లో వీర్య‌క‌ణాల‌ను వృద్థి చేసే టెస్టోస్టీరాన్ హార్మోన్ ఉత్ప‌త్తిలో అస‌మ‌తుల్య‌త ఏర్ప‌డితే అనేక అనారోగ్య సమ‌స్య‌లు ఏర్ప‌డుతాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. టెస్టోస్టీరాన్ హార్మోన్ త‌గ్గితే సంతానోత్ప‌త్తిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంటుంది. అంగ‌స్తంభ‌న లోపం కూడా ఏర్ప‌డుతుంది. దీంతో సంతానం క‌లిగే అవ‌కాశాలు త‌క్కువ‌. అంతేకాకుండా గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. టెస్టోస్టీరాన్ హార్మోన్ త‌గ్గ‌డం వ‌ల్లే పురుషుల‌కు గుండెపోటు వ‌చ్చి చ‌నిపోయే ప్ర‌మాదం ఉంద‌ని తేలింది. టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయిలు 153 మి.గ్రా. కంటే త‌క్కువ‌గా ఉంటే.. అలాంటి వారిలో గుండె జ‌బ్బులు అధికంగా వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు అన్న‌ల్స్ ఆఫ్ ఇంట‌ర్న‌ల్ మెడిసిన్ అధ్య‌య‌నంలో తేలింది. కండ‌రాలు కూడా బ‌ల‌హీన‌మై, ఎముక‌లు విరిగిపోవ‌డానికి ఆస్కారం ఉంటుంద‌ని వెల్ల‌డైంది.

టెస్టోస్టీరాన్ పెరుగుద‌ల‌కు ఏం చేయాలంటే..?

టెస్టోస్టీరాన్ హార్మోన్ పెరుగుద‌ల‌కు శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుకోవాలి. శ‌రీర బ‌రువు పెరిగితే కొవ్వు కూడా అధిక‌మ‌వుతుంది. ఈ కొవ్వు.. టెస్టోస్టీరాన్‌ను ఈస్ట్రోజ‌న్ హార్మ‌న్‌గా మార‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తుంది. కాబ‌ట్టి శ‌రీరంలో కొవ్వు పెర‌గ‌కుండా చూసుకోవాలి. కానీ మ‌ధుమేహం రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. మ‌ధుమేహం బారిన ప‌డితే కూడా టెస్టోస్టీరాన్ హార్మోన్ స్థాయిలు ప‌డిపోయే ప్ర‌మాదం ఉంట‌ది.
క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయ‌డం వ‌ల్ల టెస్టోస్టీరాన్ స్థాయిలు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌. వ్యాయామం గుండె జ‌బ్బుల‌ను, క్యాన్స‌ర్ వంటి రోగాల నుంచి కాపాడుతుంది. ప్ర‌శాంతంగా నిద్రించాలి. పొగాకు ఉత్ప‌త్తుల‌కు దూరంగా ఉండాలి. అతిగా మ‌ద్యం సేవించ‌కూడ‌దు. ఒత్తిడి ద‌రి చేర‌నీయ‌కూడ‌దు. పురుషుల్లో దానిమ్మ టెస్టోస్టీరాన్ ఉత్పత్తిని పెంచడానికి.. వారి లైంగిక జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

Latest News