Health Tips | గుండె( Heart ) పదిలంగా ఉండాలంటే.. ఆహార పదార్థాల( Food Items ) విషయంలో తప్పక నియమాలు పాటించాలి. ఎందుకంటే ఫ్రైడ్ ఫుడ్( Fried Food ) తీసుకుంటే గుండె ఆరోగ్యాని( Heart Health )కి చాలా ప్రమాదకరం. పదే పదే వేడి చేసిన నూనెతో తయారు చేసే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తీసుకున్నారంటే గుండె ఆరోగ్యాన్ని మీ చేజేతులారా చెడగొట్టుకున్నట్టే. మరి ముఖ్యంగా ఈ ఏడు రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ధమనులు త్వరగా బ్లాక్ అయిపోయి గుండెపోటు( Heart Stroke ) సంభవించే అవకాశం ఉంది. మరి తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏవో తెలుసుకుందాం.
వైట్ బ్రెడ్, పేస్ట్రీలు..
చాలా మంది అలా బేకరికి వెళ్లి వైట్ బ్రెడ్, పేస్ట్రీలను లాగేస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా ఈ ఆహార పదార్థాలను తింటుంటారు. మిఠాయిలు కూడా బాగానే ఆరగిస్తుంటారు. ఈ ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర వేగాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ట్రై గ్లిజరైడ్లు పెరిగి.. ధమనుల చుట్టు కొవ్వు పేరుకుపోతుంది. దీర్థకాలంలో ఇది షుగర్ వ్యాధికి దారి తీస్తుంది. గుండెపోటు కూడా సంభవించే అవకాశం ఉంది.
చిప్స్, జంక్ ఫుడ్..
మరి ముఖ్యంగా చిన్న పిల్లలతో పాటు మధ్య వయసు కలిగిన వారు చిప్స్, జంక్ ఫుడ్స్‌కు బానిసగా మారుతుంటారు. వీటిల్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొవ్వు క్రమక్రమంగా తగ్గిపోయి.. రక్తనాళాలు ఇరుకుగా మారిపోతాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
ఇన్‌స్టంట్ న్యూడుల్స్..
ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్యాక్ చేసిన సూప్, ఊరగాయలు, చిప్స్‌తో పాటు రెస్టారెంట్‌లో తయారు చేసే ఆహార పదార్థాలలో సోడియం చాలా అధికంగా ఉంటుంది. సోడియం రక్తపోటును పెంచుతుంది. ధమని గోడలకు నష్టం కలిగి ఫలకం ఏర్పడుతుంది. గుండెపోటుకు దారి తీస్తుంది.
మటన్, బీఫ్..
మటన్, బీఫ్, లాంబ్లలో సంతృప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇది TMAOని పెంచుతుంది. ఫలకాలను ఏర్పరిచే ఒక సమ్మేళనం ఇది. నిపుణులు దీనిని అప్పుడప్పుడు మాత్రమే తినమని సలహా ఇస్తారు.
ఎనర్జీ డ్రింక్స్..
సోడా జీవక్రియను దెబ్బతీస్తుంది. కోరికలను పెంచుతుంది. ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగం, రక్తపోటును పెంచుతాయి. కాలక్రమేణా గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
