విధాత: పొటాటో చిప్స్ తినాలని అందరికీ ఆశే, కానీ వెంటనే పెరిగే బరువు గుర్తొచ్చి భయం పుడుతుంది. చికెన్ పకోడా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయి ఎన్ని తిన్నామో తెలీదు కానీ తిన్న ఆనందం కాసేపు కూడా నిలవదు ఆరోగ్యం ఏమవుతుందో అని. వేపుళ్లు తిని అవి తిన్న సంతోషం లేకుండా గిల్ట్ అవడం ఇక అవసరం లేదట. అదేలాగో తెలుసుకుందామా మరి, పదండి ఈ ఆర్టికల్ చదివితే ఇట్టే తెలిసిపోతుంది.
కిచెన్ గాడ్జెట్స్ లో ఈ మద్య కాలంలో అత్యంత ఆకర్శణీయంగా కనిపిస్తున్న పరికరం ఏంటంటే అది ఏయిర్ ఫ్రైయర్. చూసేందుకు చిన్న కుక్కర్ లాగే కనిపిస్తుంది. కానీ కుక్కర్ తో పోలిస్తే సగం ఇంధనంతో పని కానిచ్చేస్తుంది. దీని వాడకం చవక కూడా. పేరులో ప్రై అనే మాట ఉన్నప్పటికి ఇదేమీ ఆహార పదార్థాలను వేయించదు. కానీ వేపుళ్ల మాదిరిగానే క్రిస్ప్ గా మారుస్తుంది. ఎంతో ఆకర్శణీయంగా కనిపిస్తున్నా ఈ పరికరాల గురించిన పరిశోధన మాత్రం పరిమితంగానే జరుగిందని చెప్పొచ్చు.
ఆహారం తయారు చేస్తున్నపుడు ముఖ్యంగా వేయించినపుడు వాటిలో అక్రిలమైడ్ అనే రసాయనాలు తయారవుతాయి. ఇది నేరుగా క్యాన్సర్ కు కారణం అవుతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వారు చెబుతున్నారు. ఎండోమెట్రియల్, ఆండాశయ, పాంక్రియాటిక్, రొమ్ము, అన్నవాహిక వంటి చాలా రకాల క్యాన్సర్లకు ఈ అక్రిలమైడ్ నేరుగా కారణం అవుతుందట.
ఎయిర్ ప్రైలలో ఆహారం వేయించడం అసలు జరగదు కాబట్టి అక్రిలమైడ్ ఉత్పత్తి కాదని అంటున్నారు. అయితే ఈ మ్యాజికల్ గాడ్జెట్ వల్ల నష్టాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
నూనె వాడకం లేని, తక్కువ ఇంధనంతో పనిచేసే ఈ ఏయిర్ ప్రైయర్ నిజానికి గుడ్ న్యూస్ వంటిదే. అయితే ఈ ఏయిర్ ఫ్రైయర్ లను ఉపయోగించడం అలవాటయితే ఒకే రకమైన ఆహారం తీసుకోవడానికి అలవాటవుతారేమో అనుమానం వ్యక్తం చేశారు వుడ్ల్యాండ్ మెడికల్ సెంటర్ కు చెందిన డాక్టర్ రాచెల్ వార్డ్.
ఇప్పటివరకు ఎక్కువగా ఆలుగడ్డలు, మాంసం వేయించడానికి మాత్రమే ఏయిర్ ఫ్రయర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కానీ అన్ని కూరగాయలు, రకరకాల వంటల తయారీలో కూడా దీన్ని వాడి ఆ పదార్థాలు తిన్నపుడు ఇది ఆరోగ్యానికి మేలు చేసేది అవుతుంది.
ఏయిర్ ఫ్రయర్ ను మొత్తం వంటకు ఉపయోగించాలనుకుంటే తీసుకునే ఆహారం సమతులంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. శరీరానికి అన్ని పోషకాలు అవసరమే. ఏయిర్ ప్రయర్లో వండి ఆహారం వినియోగంతో బరువు తగ్గవచ్చు. మరింత బరువు పెరగకుండా నియంత్రించవచ్చు అని నిపుణులు అంటున్నారు. దాదాపు 75శాతం నూనె వినియోగం తగ్గుతుంది. కనుక శరీరంలో చేరే కాలరీల సంఖ్య కూడా తగ్గుతుంది.
హీటింగ్ ఎలిమెంట్ ద్వారా వేడిగాలి తయారై ఏయిర్ ప్రయర్ ఒక కన్వన్షన్ ఓవెన్ మాదరిగా పనిచేస్తుంది. లోపల ఉన్న ఆహారం చుట్టూ ఫ్యాన్లద్వారా వేడి గాలి ప్రసరిస్తుంది. అందువల్ల ఆహారం పూర్తిగా ఉడికిపోతుంది. చాలా తక్కువ నూనె వినియోగంతో కరకరలాడే ఫ్రైడ్ బ్రౌన్ ఫుడ్ రెడీ అవుతుంది.
అయితే ఆహారం తయారీ ప్రక్రియలో లోపల వాడే బాస్కెట్ కు ఉడికిన ఆహారం అంటుకోకుండా కాస్త నూనె రాయడం మాత్రం తప్పదు. మరి ఈ సారీ షాపింగ్ లిస్ట్ లో ఏయిర్ ప్రయర్ ను చేర్చుకోవాల్సిందేనేమో ఒక సారి ఆలోచించండి.