Site icon vidhaatha

Health Tips | వంటింటి దివ్యౌషధంతో జలుబు నుంచి క్యాన్సర్‌ దాకా అన్నింటికి చెక్‌..!

Health Tips : వంటిల్లు అనేది ప్రతి కుటుంబానికి ప్రకృతి (Nature) ప్రసాదించిన ఫార్మసీ (Pharmacy) లాంటిది. ఎందుకంటే వంటింటి పదార్థాలైన (Kitchen Ingredients) జీలకర్ర, మెంతులు, ఆవాలు, అల్లం, ఎల్లిగడ్డ, లవంగాలు, యాలకులు, మిరియాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే వంటిల్లును ప్రకృతి ప్రసాదించిన ఫార్మసీ అనాలని అనిపించింది. అయితే ఈ ఫార్మసీలో ఉండే ఒక పదార్థం మాత్రం.. జలుబు (Cold) నుంచి క్యాన్సర్‌ (Cancer) వరకు ప్రతి అనారోగ్య సమస్యపై పోరాటం చేయగలిగే ఔషధ గుణాన్ని కలిగివుంది. అదే లవంగం (Clove). దాన్నే ‘దేవ కుసుమ’ అని కూడా అంటారు. ఈ లవంగంలో ఐరన్‌తోపాటు కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, సోడియం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, మాంగనీస్‌, విటమిన్ ఎ, సి ఉంటాయి. లవంగాలను వంటల్లోనే గాక కాస్మొటిక్స్, ఔషధాలు, టూత్‌పేస్ట్ తయారీలో కూడా వినియోగిస్తారు.

ఆరోగ్య ప్రయోజనాలు..

1. లవంగాలకు ఎన్నో దివ్యమైన ఔషధ గుణాలున్నాయి. వీటిని క్రమం తప్పకుండా వాడితే పళ్లు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి.

2. మనం తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు నోట్లో ఓ రెండు లవంగాలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వికారం లాంటివి కూడా పోతాయి.

3. జలుబు, దగ్గు లాంటి సమస్యలకు లవంగం మంచి మందు. నోట్లో ఓ లవంగం వేసుకుని చప్పరిస్తూ ఉంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

4. అంతేగాక లవంగాలను రోజూ తినడం వల్ల శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోతాయి.

5. తలనొప్పి రోజూ భరించలేనిదిగా విసిగిస్తుంటే రోజూ రెండు లవంగాలు తినడంతో ఉపశమనం లభిస్తుంది.

6. పైగా లవంగాలు రక్తపోటు (బీపీ)ను నియంత్రిస్తాయి. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతాయి.

7. అదేవిధంగా లవంగాల్లో యూజెనాల్ అనే నూనె ఉంటుంది. అది నొప్పులు, వాపులు, మంటలను తగ్గిస్తుంది.

8. పొట్టలో అల్సర్ సమస్యలకు కూడా లవంగాలు విరుగుడుగా పనిచేస్తాయి.

9. లవంగాలను క్రమం తప్పకుండా తింటే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయని పరిశోధనల్లో తేలింది.

10. అంతేగాక శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించి బరువు తగ్గడానికి కూడా లవంగాలు తోడ్పడుతాయి.

11. లవంగాల్లో మాంగనీస్‌ పుష్కలంగా ఉంటుంది. ఎముకలు దృఢంగా మారేందుకు ఈ లవంగాలు తోడ్పడుతాయి.

Exit mobile version