Mangoes | మామిడి పండ్లు తిన‌గానే ఈ ఐదింటి జోలికి అస్సలే పోవ‌ద్దు..!

Mangoes : వేసవి ఆగ‌మ‌నంతోనే మార్కెట్‌లోకి మామిడి పండ్ల రాక మొద‌ల‌వుతుంది. మ‌న దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మ‌రెక్కడా ల‌భించ‌న‌న్ని ర‌కాల మామిడి పండ్లు భార‌త్‌లో ల‌భిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు ర‌క‌ర‌కాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగ‌వ‌చ్చు.

  • Publish Date - May 16, 2024 / 08:29 PM IST

Mangoes : వేసవి ఆగ‌మ‌నంతోనే మార్కెట్‌లోకి మామిడి పండ్ల రాక మొద‌ల‌వుతుంది. మ‌న దేశం మామిడి పండ్లకు ఎంతో ప్రసిద్ధి. ప్రపంచంలో మ‌రెక్కడా ల‌భించ‌న‌న్ని ర‌కాల మామిడి పండ్లు భార‌త్‌లో ల‌భిస్తాయి. అంతేకాదు దేశంలోని మామిడిపండ్లు ర‌క‌ర‌కాల రుచుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ మామిడి పండ్లను నేరుగా తినొచ్చు. జ్యూస్‌లుగా చేసుకుని తాగ‌వ‌చ్చు. మామిడి తాండ్ర, మామిడి క‌రేలా లాంటి ప‌దార్థాలు త‌యారు చేసుకుని కూడా తినొచ్చు. అయితే, ఈ మామిడిపండ్లు తిన్న త‌ర్వాత ఓ ఐదు ర‌కాల ప‌దార్థాల‌ జోలికి అస్సలు పోవద్దట. మ‌రి ఆ ప‌దార్థాలేమిటో తెలుసుకుందామా..?

వీటి జోలికి వెళ్లవద్దు..

మంచి నీళ్లు : మామిడి పండ్లు తిన్న త‌ర్వాత కొంత‌సేప‌టి వ‌ర‌కు మంచినీళ్లను అస్సలు తాగొద్దట‌. అలా చేస్తే ఆరోగ్యంపై దుష్ప్రభావం ప‌డుతుంద‌ట‌. క‌డ‌పు నొప్పి, అసిడిటీ, క‌డుపు ఉబ్బరం లాంటి స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉన్నద‌ట‌.

పెరుగు : మామిడి పండు తిన‌గానే పెరుగు తీసుకుంటే శ‌రీరం డీహైడ్రేట్ అవుతుంద‌ట‌. అందువ‌ల్ల అలాంటి అల‌వాటు ఉంటే త‌క్షణ‌మే మానుకోవాల‌ట‌. లేదంటే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందట. అంతేగాక చ‌ర్మ స‌మ‌స్యలు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉన్నద‌ట‌.

కాక‌ర‌కాయ‌ : మామిడి పండ్లు తిన్న త‌ర్వాత కాక‌ర‌కాయ తీసుకోవ‌డం కూడా మంచిది కాద‌ట‌. అలా చేయ‌డంవ‌ల్ల వికారం, వాంతులు, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్యలు వస్తాయ‌ట‌.

ఘాటైన ప‌దార్థాలు : మామిడి పండ్లు తిన్న త‌ర్వాత ఘాటు ప‌దార్థాలుగానీ, కారం ప‌దార్థాలుగానీ తీసుకుంటే ఉద‌ర సంబంధ స‌మ‌స్యలు, చ‌ర్మ స‌మ‌స్యలు వ‌చ్చే అవ‌కాశం ఉన్నద‌ట‌. అంతేగాక ముఖంపై మొటిమ‌లు వ‌చ్చే ప్రమాదం కూడా ఉన్నద‌ట‌.

చ‌ల్లటి పానీయాలు : మామిడి పండ్లతోపాటు చ‌ల్లటి పానీయాలు తీసుకోవ‌డం కూడా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ట‌. చ‌ల్లటి పానీయాల‌తో మామిడి పండ్లను తీసుకోవ‌డంవ‌ల్ల వాటిలో షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రింత పెరుగుతాయ‌ట‌.

Latest News