Walking Benefits | న‌డ‌క అంద‌రికీ మంచిది.. మ‌ధుమేహుల‌కు మ‌రీ మంచిది..

Walking Benefits | ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఆరోగ్యాన్ని ప‌ది కాలాల పాటు ప‌దిలంగా ఉంచుకోవాలంటే.. వ్యాయామం( Exercise ) త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి వ్య‌క్తి రోజు పొద్దున్నే అర గంట నుంచి గంట పాటు వ్యాయామం చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం పెట్టొచ్చు. ఈ వ్యాయామం అందరికీ అందుబాటులో ఉంటుంది. పిల్ల‌ల నుంచి మొద‌లుకొంటే.. వృద్ధుల వ‌ర‌కు కూడా న‌డ‌క‌( Walking )ను త‌మ దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవ‌చ్చు. క‌నుక ఈ న‌డ‌క అన్ని వ‌య‌సుల వారికి […]

  • Publish Date - March 6, 2023 / 03:20 AM IST

Walking Benefits | ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఆరోగ్యాన్ని ప‌ది కాలాల పాటు ప‌దిలంగా ఉంచుకోవాలంటే.. వ్యాయామం( Exercise ) త‌ప్ప‌నిస‌రి. ప్ర‌తి వ్య‌క్తి రోజు పొద్దున్నే అర గంట నుంచి గంట పాటు వ్యాయామం చేస్తే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం పెట్టొచ్చు. ఈ వ్యాయామం అందరికీ అందుబాటులో ఉంటుంది. పిల్ల‌ల నుంచి మొద‌లుకొంటే.. వృద్ధుల వ‌ర‌కు కూడా న‌డ‌క‌( Walking )ను త‌మ దిన‌చ‌ర్య‌లో భాగం చేసుకోవ‌చ్చు. క‌నుక ఈ న‌డ‌క అన్ని వ‌య‌సుల వారికి మంచిది.. మ‌ధుమేహుల‌కు( Sugar Patients ) మ‌రి మంచిది.

  • మ‌ధుమేహం(షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు) దీర్ఘ కాలిక స‌మ‌స్య కాబ‌ట్టి.. త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ర‌క్తంలో గ్లూకోజు మోతాదుల‌ను త‌ప్ప‌కుండా నియంత్ర‌ణ‌లో ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం. మ‌ధుమేహాన్ని నిర్ల‌క్ష్యం చేసే కొద్ది గుండెపోటు, ప‌క్ష‌వాతం, మూత్ర పిండాల జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశం ఉంది. ఈ రోగాల‌ను మించి కంటి చూపు దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంటుంది. ఈ అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు విముక్తి పొందాలంటే న‌డ‌క త‌ప్ప‌నిస‌రి చేసుకోవాల్సిందే.
  • న‌డ‌క కేవ‌లం శారీర‌క సామ‌ర్థ్యాన్ని పెంచ‌డ‌మే కాదు.. రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా పెరుగుతుంది. చెమ‌ట ద్వారా ర‌క్తంలోని మ‌లినాలు బ‌య‌ట‌కు పోతాయి. బీపీని అదుపులో ఉంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.
  • మాన‌సికంగా స్థిరంగా ఉంటాం. ఆందోళ‌న త‌గ్గి, ఒత్తిడిని దూరం చేస్తుంది. కంటి నిండా నిద్ర ప‌డుతుంది. న‌డ‌క చేసిన రోజు మెద‌డు చాలా ప్ర‌శాంతంగా ఉంటుంది. నీర‌సం, అల‌స‌ట‌, నిస్స‌త్తువ త‌గ్గుతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
  • పెద్ద‌పేగు, రొమ్ము క్యాన్స‌ర్ వంటి జ‌బ్బుల‌ను దూరం చేసుకోవ‌చ్చు. కీళ్లు, ఎముక‌లు ధృడ‌మ‌వుతాయి.

Latest News