Site icon vidhaatha

Health Tips | వానాకాలంలో జ్వ‌రంతో బాధ‌ ప‌డుతున్నారా..? ఈ ఆహారం తీసుకుంటే బెట‌ర్..!

Health Tips |

వానాకాలం వ‌చ్చిందంటే చాలు.. జ్వ‌రాలు ప్ర‌బ‌లుతూనే ఉంటాయి. ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండ‌క‌పోతే.. ఆ ప్రాంతంలో దోమ‌లు అధిక‌మైపోతాయి. కాబట్టి విష‌జ్వ‌రాల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాదు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూర‌గాయ‌లు తీసుకోవాలి. అప్పుడే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి.. జ్వ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.

జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు శ‌రీరం వెడేక్క‌డం స‌హ‌జ‌మే. ఇందుకోసం జీల‌క‌ర్ర‌, అల్లం, ప‌సుపు, తుల‌సి వేసిన నీళ్లు త‌ర‌చుగా తాగుతూ ఉండాలి. న‌ల్లా ద్వారా వ‌చ్చే నీటిని గోరువెచ్చ‌గా చేసుకోని తాగాలి. పండ్లు తిన‌డం వ‌ల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ల కార‌ణంగా రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఈ స‌మ‌యంలో బ‌య‌టి ఆహారం తీసుకోకూడ‌దు. జంక్ ఫుడో జోలికి వెళ్ల‌క‌పోవ‌డం ఉత్త‌మం. ప్రోటీన్ ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం త్వ‌ర‌గా కోలుకుంటుంది. సిరిధాన్యాల‌తో చేసిన ఇడ్లీలు తినొచ్చు. రాగి జావ తాగొచ్చు. పాలు, మ‌జ్జిగ కూడా శ‌రీరానికి శ‌క్తినిస్తాయి.

టమాటా, క్యారెట్‌లాంటి కూరగాయలతో సూపులు చేసుకుని తాగొచ్చు. మాంసాహారులైతే బోన్‌ సూప్‌, చికెన్‌ సూప్‌లాంటివి తీసుకోవచ్చు. జ్వరాల కారణంగా కలిగే ఇన్‌ఫ్లమేషన్స్‌ (లోపలి వాపులు) తగ్గించేందుకు అల్లం నీళ్లు బాగా సహకరిస్తాయి. జొన్న, కొర్ర రవ్వతో చేసిన ఉప్మా, కిచిడీలాంటివైనా ఫర్వాలేదు. విషక్రిములు విస్తరించే కాలంలో ఆహారమే తొలి ఔషధం.

Exit mobile version