విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో శుక్రవారం నుంచి ఊపందుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేటీ నుంచి రోడ్ షోలతో ఎన్నికల ప్రచార బరిలోకి దిగనుండగా..బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గెలుపు కోసం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి విజయం కోసం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారం సాగిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నేటీ ప్రచార షెడ్యూల్
సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ షోలలో ప్రసంగిస్తారు. సాయంత్రం 7 గంటలకు- వెంగళరావు నగర్ డివిజన్ లో పీజేఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ వరకు రోడ్ షో, సాయిబాబా టెంపుల్ ( చాకలి ఐలమ్మ విగ్రహం) వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు సోమాజీగూడ డివిజన్ లో ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా( కృష్ణా అపార్ట్ మెంట్స్ సమీపంలో) వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
నవంబర్ 1న ఉదయం బోరబండలో, రాత్రి 8 గంటలకు ఎర్రగడ్డలో, 4వ తేదీన ఉదయం షేక్ పేట 1డివిజన్ లో, రాత్రి రహమత్ నగర్ లో ప్రచారం చేస్తారు. 5వ తేదీన ఉదయం షేక్ పేట 2లో, సాయంత్రం యూసఫ్ గూడలో, 8వ తేదీన ఆరు డివిజన్లలో మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొంటారు. 9వ తేదీన షేక్ పేటలో ఉదయం 10గంటలకు మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.
కేటీఆర్ రోడ్ షోల షెడ్యూల్
కేటీఆర్ శుక్రవారం షేక్‌పేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొంగారు. నవంబర్ 1న రహమత్‌నగర్‌లో, నవంబర్ 2న యూసుఫ్‌గూడ లో, నవంబర్ 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళ్ రావు నగర్ లో, నవంబర్ 6న ఎర్రగడ్డ డివిజన్‌లో కేటీఆర్ రోడ్ షో లు నిర్వహించనున్నారు. 9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు బీఆర్ఎస్ బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొంటారు.
