విధాత : సంగారెడ్డి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై నిఘాలో భాగంగా పంట చేన్లపై నిర్వహించిన డ్రోన్ సర్వేలలో పెద్ద ఎత్తున గంజాయి సాగు బయటపడటం కలకలం రేపింది. పత్తి పంటల అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి సాగు డ్రోన్ కెమెరాలకు చిక్కింది. నారాయణఖేడ్ ప్రాంతంలోని పలు చోట్ల అంతర్ పంటగా గంజాయి సాగు వెలుగు చూసింది. చూడటానికి పత్తి పంటలో అంతర్ పంట కంది చేను మాదిరిగా గంజాయి మొక్కలు కనిపిస్తున్నాయి.
దీంతో రహస్యంగా పత్తి చేనులో అంతర్ పంటగా గంజాయి సాగు చేపట్టారు. అయితే పోలీస్ శాఖ చేపట్టిన డ్రోన్ సర్వేలతో అక్రమ గంజాయి సాగు గుట్టు రట్టయ్యింది. గంజాయి సాగు నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఇంకా ఎక్కడైనా గంజాయి సాగవుతుందా అన్న అనుమానాలతో పంట పొలాలను డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నారు.