Japan Earthquake : జపాన్ లో మరోసారి భారీ భూకంపం..సునామీ హెచ్చరికలు

జపాన్‌లో మరోసారి 6.7 తీవ్రతతో కూడిన భారీ భూకంపం సంభవించింది. దీంతో జపాన్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

Japan Earthquake

న్యూఢిల్లీ : జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తాజా భూకంపం తీవ్రత 6.7గా నమోదైంది. దీంతో జపాన్ వాతావరణ శాక వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో సుమారు మీటరు (3 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.. హోన్షు ద్వీపంలోని ఇవాటే ప్రిఫెక్చర్‌లోని కుజీ నగరానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈశాన్య జపాన్‌లోని కుజీ పట్టణంలో భూకంపంతో వణికిపోయింది.

జపాన్ లో ఐదు రోజుల వ్యవధిలో ఇది రెండో భారీ భూకంపం కావడం విశేషం. జపాన్ ఉత్తర ప్రాంతంలో గత సోమవారం7.5తీవ్రతతో భూకంపం నమోదైంది. సముద్రపు అలలు 3మీటర్లు ఎగిసి పడ్డాయి. ఈ ప్రకంపనాలో పసిఫిక్‌ తీర ప్రాంతాల్లో చిన్న సునామీ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. జపాన్ దేశం పసిఫిక్‌ ప్లేట్‌, ఫిలిప్పైన్‌ సీ ప్లేట్‌, యూరాసియన్‌ ప్లేట్‌, నార్త్‌ అమెరికన్‌ ప్లేట్‌ కలిసే చోట ఉండటంతో ఈ భూభాగంలో తరచు భూకంపాలు సాధారణంగా మారిపోయాయి.

ఇవి కూడా చదవండి :

Chandrababu Naidu : కాగ్నిజెంట్ తో లక్షమందికి ఉద్యోగావకాశాలు
Himalayas Earthquakes | హిమాలయాలకు పొంచి ఉన్న రెండు భారీ భూకంపాలు! తీవ్రత తెలిస్తే షాకే!

Latest News